TEPPOTSAVAM CONCLUDES AT SRI GT _ వైభ‌వంగా ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

Tirupati, 8 Feb. 20: The seven day long Teppotsavam of the ancient temple of Sri Govindaraja Swamy concluded on a grand note on Saturday evening.

The utsava idols of Sri Govindaraja Swamy and His consorts were taken on the colourfully decked float for seven rounds after a grand snapana thirumanjanam in the morning.

The artists of HDPP and Annamacharya Projects rendered bhajans, harikatha and Bhakti sangeet programs.

Sri Sri Sri Chinna Jeeyar, Special grade DyEO Smt Varalakshmi, AEO Sri Ravi Kumar Reddy, Superintendents Sri Raj Kumar and temple inspectors Sri Krishna Murthy and Sri Munindra Babu and large number of devotees participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

వైభ‌వంగా ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
 
తిరుపతి, 2020 ఫిబ్రవరి 08: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పుష్కరిణిలో ఏడు రోజుల పాటు జరిగిన స్వామివారి తెప్పోత్సవాలు శ‌నివారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 
 
ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంత‌రం  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.00 గంటల వరకు తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భ‌క్తుల‌ను క‌టాక్షించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.
 
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ్య‌ర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ శ‌ర్మ‌, శ్రీ రాజ్‌కుమార్‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఏ.పి.శ్రీ‌నివాస దీక్షితులు,టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్ర‌బాబు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.