TEPPOTSAVAM CONCLUDES AT TIRUCHANOOR TEMPLE _ వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు

Tirupati,4, June,2023:  The five-day Teppotsavam festival ( flat festival) of Sri Padmavati temple, Tiruchanoor, concluded on Sunday night with the colourfully decorated flat doing seven rounds in the Padma Pushkarini.

Earlier  Goddess blessed devotees on the favourite Garuda Vahana on the Mada streets and blessed devotees.

In the morning after Nitya Kaikaryas, the Sahasra namarchana and nityarchana were observed and thereafter grand abhisekam was performed to Goddess at the Nirada Mandapam.

TTD JEO  Sri Veerabrahmam couple, DLO Sri Viraju couple, AEO Sri Ramesh, Archaka Sri Babuswamy, Superintendent Sri Madhu, Inspectors  Sri Subha and Sri Ganesh were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

 

వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు

– గ‌రుడ వాహ‌నంపై అమ్మ‌వారి ద‌ర్శ‌నం

తిరుపతి, 2023 జూన్ 04: తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుండి 5 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. పుష్కరిణిలో తెప్పపై అమ్మవారు ఏడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, డిఎల్ వో శ్రీ వీర్రాజు దంపతులు, ఏఈవో శ్రీ రమేష్, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరిండెంట్ శ్రీ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.