TEPPOTSAVAM OFF TO A COLOURFUL START IN TML_ వైభవంగా తెప్పోత్సవాలు ప్రారంభం తెప్పపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ సీతారామలక్ష్మణులు

Tirumala 25,February 2018:The five day annual teppotsavam off to a colourful start in Tirumala on Sunday evening.

The pleasant evening witnessed Lord in Sri Rama Avatar accompanied by Goddess Sita, Sri Lakshmana Swamy and Sri Anjaneya Swamy on either side. The deities took three rounds on the finely decked float in the sacred waters of Swamy Pushkarini.

Tirumala Pedda Jiyar Swamy, EO Sri Anil Kumar Singhal, JEO Sri KS Sreenivasa Raju were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా తెప్పోత్సవాలు ప్రారంభం తెప్పపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ సీతారామలక్ష్మణులు

ఫిబ్రవరి 25, తిరుమల, 2018: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణిలో చల్లటి సాయంత్రం వేళ స్వామివారు తెప్పపై విహరిస్తుండగా భక్తులు దర్శించుకుని పరవశించి పోయారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ తిరుమలలో తెప్పోత్సవాలు ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోందన్నారు. విజయనగర రాజైన సాళువ నరసింహరాయలు క్రీ.శ.1468లో పుష్కరిణి మధ్యలో ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. క్రీ.శ. 15వ శతాబ్దానికి చెందిన శ్రీవారి భక్తుడు, వాగ్గేయకారుడు అయిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య కూడా తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారని వివరించారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దరకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు.

ఫిబ్రవరి 26న రెండో రోజైన సోమవారం రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మూడుసార్లు విహరిస్తారు. ఫిబ్రవరి 27న మూడో రోజు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు, ఫిబ్రవరి 28న నాలుగో రోజు ఐదుసార్లు, చివరిరోజు మార్చి 1వ తేదీన ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల నేపథ్యంలో ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.