TEPPOTSAVAMCOMMENCES ON A GRAND COLOURFUL NOTE _ వైభవంగా శ్రీ‌వారి తెప్పోత్సవాలు ప్రారంభం తెప్పపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ సీతారామలక్ష్మణులు

LORD RAMA GRACES PILGRIMS ON DAY ONE OF FLOAT FEST

Tirumala, 5 March 2020 ;The five day annual float festival kick started with Lord Sri Kodanda Rama taking pleasure ride along with Goddess Sita Devi and Sri Lakshmana Swamy. 

The finely decked float glided swiftly on the holy waters of Swamy Pushkarini. The devotees who occupied the stairs surrounding pushkarini rendered Harati to the dazzling deities on float chanting Govinda… Govinda out of religious ecstasy. 

EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, CAG Chief Sri Rajiv Mehrishi and other officers of TTD were also present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

వైభవంగా శ్రీ‌వారి తెప్పోత్సవాలు ప్రారంభం – తెప్పపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ సీతారామలక్ష్మణులు

తిరుమల, 2020 మార్చి 05 ; తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా  శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణిలో చల్లటి సాయంత్రం వేళ స్వామివారు తెప్పపై విహరిస్తుండగా భక్తులు దర్శించుకుని పరవశించి పోయారు.
       
ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి  వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో  తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు.
       
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, భార‌త కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ శ్రీ రాజీవ్ మెహ్రీషి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సిఇ శ్రీ రామ‌చంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఎస్ఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, డిఇ శ్రీ‌మ‌తి స‌ర‌స్వ‌తి, ఇఇలు శ్రీ శ్రీ‌హ‌రి, శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
  
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.