TEPPOTSAVAMS AT SRI LAKSHMI VENKATESWARA SWAMY TEMPLE IN DEVUNI KADAPA _ మే 24 నుండి 26వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు

Tirupati, 22 May 2021: TTD is organising annual Teppotsavams of Sri Lakshmi Venkateswara Swamy temple in Devuni Kadapa of YSR Kadapa district from May 24-26 in Ekantam due to Covid guidelines.

As a part of the festivities, daily Snapana Tirumanjanam will be held to utsava idols of Sri Lakshmi Venkateswara and His consorts in the evening.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 24 నుండి 26వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు

తిరుపతి, 2021 మే 22: వైఎస్సార్‌ కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 24 నుండి 26వ తేదీ వరకు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు ఆల‌యంలో సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. ఆనంత‌రం ఆస్థానం చేప‌డ‌తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.