TEPPOTSAVAMS COMMENCES _ శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

Tirumala, 20 March 2024: The annual Teppotsavams commenced on a grand celestial note with Sri Seeta Lakshmana Anjaneya Sameta Sri Ramachandra Murty taking a pleasant ride for three rounds on the finely decked float in the Swamy Pushkarini waters.

TTD cancelled Sahasra Deepalankara seva in connection with the float festival on Wednesday.

Ramachadruditadu Raghuveerudu and other Sri Rama Sankeertans were rendered on the occasion by vocal and instrumental artists while Veda Parayanamdars recited vedic hymns in a rhythmic manner.

TTD EO Sri AV Dharma Reddy, CE Sri Nageswara Rao, VGOs Sri Nandakishore, Sri Giridhara Rao, Sri Bali Reddy, temple DyEO Sri Lokanatham and other officials, devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

– మొద‌టిరోజు శ్రీ సీతారామలక్ష్మణులు తెప్పపై విహారం

తిరుమల, 2024 మార్చి 20: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు.

ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజిఓలు శ్రీ నంద కిషోర్, శ్రీ గిరిధర్ రావు, శ్రీ బాల్ రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.