TEPPOTSAVAMS COMMENCES _ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం
Tirupati 02 Feb 20 ;The annual float festival of Teppotsavams has commenced in Sri Govindarajaswamy temple on Sunday.
On Sunday, the utsava idols of Sita Lakshmana sameta Sri Kodandarama Swami took float ride in the Sri Govindarajaswamy Pushkarani in the temple city.
DyEO Smt Varalakshmi, AEO Sri Ravi Kumar Reddy and other officials participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2020 ఫిబ్రవరి 02: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఏడు రోజుల పాటు జరుగనున్న ఈ తెప్పోత్సవాల్లో సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు, అమ్మవారితో కలిసి తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
ఇందులో భాగంగా మొదటిరోజు తిరుపతిలోని శ్రీ కోందరామస్వామివారి ఆలయం నుండి శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవర్లు ఊరేగింపుగా శ్రీగోవిందరాజస్వామివారి పుష్కరిణిి చేరుకున్నారు.
అనంతరం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా సోమవారం శ్రీ పార్థసారథిస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ్యర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ శర్మ, శ్రీ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.