TEPPOTSAVAMS CONCLUDES _ ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

TIRUMALA, 13 MARCH 2025: The annual Teppotsavams in Tirumala concluded on a grand religious note on Thursday evening.

With the processional deities of Sri Malayappa along with Sridevi and Bhudevi taking a celestial ride on the holy waters of Swamy Pushkarini blessing the devotees, the Teppa Tirunallu came to a ceremonious end on the pleasant evening of full moon day.

Both the Senior and Junior Pontiffs of Tirumala, Supreme Court Judge Justice Sarasa Venkata Narayana Bhatti, DLO Sri Varaprasad Rao, DyEO Sri Lokanatham, Peishkar Sri Ramakrishna and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమల, 2025 మార్చి 13: తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్ప‌పై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు.

ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను క‌టాక్షించారు. మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ శ్రీ ఎస్.వి.ఎన్‌.భ‌ట్టి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.