TEPPOTSAVAMS CONCLUDES _ శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన తెప్పోత్సవాలు
TIRUPATI, 26 DECEMBER 2023: The ongoing annual Teppotsavams at Sri Kapileswara Swamy temple, concluded on Tuesday evening.
Sri Chandikeswara Swamy took out nine rounds on the float in the sacred waters to bless the devotees.
DyEO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Bhupati and others were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన తెప్పోత్సవాలు
తిరుపతి, 2023 డిసెంబరు 26: తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు రాత్రి శ్రీ చండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు,
సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.