PAVITROTSAVAMS IN TALLPAKA CHENNAKESHAVA TEMPLE_ ఆగస్టు 26 నుంచి 28వ తేదీ వరకు తాళ్లపాక శ్రీచెన్నకేశవస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

Tirupati, 19 August 2017: The three day annual Pavitrotsavams will be performed in Sri Chenna Keshava Swamy temple in Tallapaka of Kadapa district with Ankurarpanam on August 25.

On first day Pavitra Pratishta, second day Pavitra Samarpana and on final day Purnahuti will be observed.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగస్టు 26 నుంచి 28వ తేదీ వరకు తాళ్లపాక శ్రీచెన్నకేశవస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు

తిరుపతి, 2017 ఆగస్టు 19: కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు ఆగస్టు 26 నుంచి 28వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు విష్వక్సేనపూజ, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 26వ తేదీ ఉదయం 9.00 నుండి 1.00 గంటల వరకు చతుష్టార్చన, యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. ఆగస్టు 27వ తేదీ ఉదయం 9.00 నుండి 1.00 గంటల వరకు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 28న ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, పవిత్రవితరణ కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 6.00 గంటల నుండి స్వామి, అమ్మవార్లవీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.