THANKS GIVING PUJA OFFERED TO DAMS_ 25 నెలలకు గాను భక్తుల అవసరాలకు సరిపడా నీరు : టిటిడి ఈవో
Tirumala, 9 November 2017: TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju offered thanks to Goddess of Water, Ganga Devi on Thursday evening.
Speaking to media persons at Papavinasanam dam after offering Ganga Puja the EO said “thanks to the recent rains which filled all the dams in Tirumala almost full to their capacities. These waters will suffice the needs of the pilgrims for over 11 months and including Kalyani Dam it will last for 25 months “, EO added.
The EO said both Papavinasanam and Akasa Ganga dams have reached 100 percent levels while the Gogarbham dam filled upto 65 percent and KP dam 94 percent.
Earlier turmeric, vermilion, sare, flowers, fruits and coconuts were offered in the waters of all dams amidst chanting of vedic mantras by priests.
SE 2 Sri Ramachandra Reddy, DyEOs Sri Kodanda Rama Rao, Sri Venugopal, EE waterworks Sri Srinivasulu and other engineering officials were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
25 నెలలకు గాను భక్తుల అవసరాలకు సరిపడా నీరు : టిటిడి ఈవో
తిరుమలలో ఘనంగా గంగపూజ
నవంబరు 09, తిరుమల, 2017: కల్యాణి డ్యామ్ నీటితో కలుపుకుంటే తిరుమలలోని డ్యామ్‌లలో 25 నెలలకు గాను భక్తులకు సరిపడా నీరు అందుబాటులో ఉందని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలోని పాపవినాశనం, ఆకాశగంగ డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండిన నేపథ్యంలో గురువారం గంగపూజ నిర్వహించారు. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజుతో కలిసి ఈవో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాపవినాశనం డ్యామ్ వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ డ్యామ్‌లు పూర్తిస్థాయిలో నిండినపుడు గంగపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీవారి ఆశీస్సులతోపాటు గంగమ్మ దయ, కారీరిష్టి యాగం ఫలితంగా తిరుమలలో విస్తృతంగా వర్షాలు కురిశాయని, తద్వారా డ్యామ్‌లలోకి ఆశించినస్థాయిలో నీరు చేరిందని వివరించారు. యాగం నిర్వహణకు సహకరించిన కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతిస్వామికి ఈ సందర్భంగా ఈవో ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం పాపవినాశనం, ఆకాశగంగ డ్యామ్‌లలో 100 శాతం నీరు నిల్వ ఉందని, గోగర్భం డ్యామ్‌లో 65 శాతం, కుమారధార, పసుపుధార డ్యామ్‌లలో 94 శాతం నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. రోజుకు సరాసరి 14 ఎంఎల్‌డిల నీటిని వినియోగించుకున్న పక్షంలో తిరుమలలోని డ్యామ్‌లలో 11 నెలలకు సరిపడా నీరు నిల్వ ఉందని తెలియజేశారు. తిరుపతిలోని కల్యాణి డ్యామ్ నుంచి రోజుకు 8 ఎంఎల్‌డిల నీటిని తీసుకుంటే 25 నెలల వరకు భక్తుల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.
అంతకుముందు తిరుమలలోని పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం డ్యామ్‌లలో గంగపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపుకుంకుమ, చీర, సారె, పూలు, పండ్లను నీటిలో వదిలి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీకోదండరామారావు, శ్రీ వేణుగోపాల్, వాటర్ వర్క్స్ ఇఇ శ్రీ శ్రీనివాసరావు ఇతర ఇంజినీరింగ్, వాటర్ వర్క్స్ సిబ్బంది పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.