THE PERFORMANCES BY DANCE TROUPES ADD FLAVOUR FOR GARUDA VAHANA SEVA _ గరుడసేవలో కళాబృందాల కోలాహలం ఆయా రాష్ట్రాల సంప్రదాయాన్ని కళ్లకు కట్టిన ప్రదర్శనలు
IT’S A FUSION OF DIVERSIFIED CULTURES AT TIRUMALA
DEVOTEES SPELL BOUND BY THE UNIQUE PERFORMANCES
Tirumala, 4 Oct. 19: The 2019 annual Brahmotsavams have witnessed the most significant and unique performance by artistes hailing from different states across the country during Garuda Seva on Friday.
In one sentence, it is a fusion of mixed cultures in Tirumala on the special occasion of Garuda vahanam. The teams from Karnataka, Tamil Nadu, Rajasthan, Gujrat, Manipur, Madhya Pradesh, Himachal Pradesh, Assam, Orissa have performed never seen before arts forms and mused the pilgrims.
Chitradurga Bharatanatyam from Karnataka, Cholia dance of Uttarakhand, Parvahi of Uttar Pradesh, Bhangra of Punjab, Bihu dance of Assam, Kolatam of Puducherry, Shankhnad of Himachal Pradesh, Tapatam, Garagattam and Oyalattam, Kokkilkattai, Nayandi Melam were performed by the artistes of Tamilnadu.
In spite of waiting in galleries for nearly one day to catch the glimpse of Garuda Vahanam, the cultural troupes organised under the aegis of Hindu Dharma Prachara Parishad of TTD enthused pilgrims in a big way.
EO complimented all the artistes for their amazing performances and keeping the pilgrims engaged with their artistic skills.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పత్రికా ప్రకటన అక్టోబరు 04, తిరుమల, 2019
2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
గరుడసేవలో కళాబృందాల కోలాహలం
ఆయా రాష్ట్రాల సంప్రదాయాన్ని కళ్లకు కట్టిన ప్రదర్శనలు
కళాకారులను అభినందించిన టిటిడి ఛైర్మన్, ఈవో
అక్టోబరు 04, తిరుమల, 2019: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన గరుడసేవలో వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులు తమ ప్రదర్శనలతో హోరెత్తించారు. మాడ వీధుల్లో కళాబృందాల కోలాహలం కనిపించింది. కళాకారులు ఆయా రాష్ట్రాల సంప్రదాయానికి పెద్దపీట వేసి జానపదశైలిలో శ్రీవేంకటేశ్వరుడిని కీర్తించారు. సరికొత్త కళారూపాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కళాప్రదర్శనలు ఏర్పాటుచేశారు.
పలు రాష్ట్రాల నుండి విచ్చేసి చక్కటి ప్రదర్శనలిచ్చిన కళాకారులను టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అభినందించారు.
చిత్రదుర్గ భరతనాట్యం
కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గకు చెందిన శ్రీమతి నందిని శివప్రకాష్ ఆధ్వర్యంలోని 26 మంది బృందం భరతనాట్యం ప్రదర్శించింది. స్థానిక సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ నృత్యాన్ని ప్రదర్శించారు.
గుజరాత్ నుండి జానపద నృత్యం
గుజరాత్ కు చెందిన శ్రీ దీపక్ మక్ మోహన్ నేతృత్వంలో 18 మంది కళాకారులు చక్కటి జానపద నృత్యాన్ని ప్రదర్శించారు.
ఉత్తరాఖండ్ నుండి చోలియా నృత్యం
ఉత్తరాఖండ్ కు చెందిన శ్రీ చందన్ సింగ్ బోరా ఆధ్వర్యంలో 15 మంది కళాకారులు ప్రదర్శించిన చోలియా డ్యాన్స్ ఆకట్టుకుంది.
ఉత్తరప్రదేశ్ నుండి ఫర్వాహి డ్యాన్స్
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన శ్రీ ముకేశ్ కుమార్ ఆధ్వర్యంలోని 15 మంది కళాకారులు ఫర్వాహి నృత్య ప్రదర్శన ఇచ్చారు.
అస్సాం సంప్రదాయ బిహు డ్యాన్స్
అస్సాం రాష్ట్రం నుండి శ్రీ అమర్ జోయేటి నేతృత్వంలో 15 మంది కళాకారులు వారి సాంప్రదాయ నృత్యం బిహు డ్యాన్స్ ను లయబద్ధంగా ప్రదర్శించారు.
పుదుచ్చేరి నుండి కోలాటం , భరతనాట్యం
పుదుచ్చేరి కు చెందిన శ్రీ బాల గురునాధన్ నేతృత్వంలో 16 మంది కళాకారులు కోలాటం, భరతనాట్యం ప్రదర్శించారు.
హిమాచల్ ప్రదేశ్ నుండి కుల్వినాటి, శనక్ ఛం నృత్యం
హిమాచల్ ప్రదేశ్ కు చెందిన శ్రీ సుందర శయాన్ నేతృత్వంలో 21 మంది కళాకారులు కుల్వినాటి నృత్యం ప్రదర్శించారు. మరో ట్రూప్ కు చెందిన 20 మంది శనక్ ఛం ప్రదర్శన చేశారు.
తమిళనాడు నుండి టపాటం , గరగాటం , ఒయలాటం.
తమిళనాడు నుండి పలువురు కళాకారులు టపాటం, గరగాటం, ఒయలాటం, నయాండి మేళం, కొక్కిల్ కట్టై ప్రదర్శనలిచ్చారు.
ఆకట్టుకున్న కోలాటం, జానపద నృత్యం
తిరుపతికి చెందిన శ్రీ శ్రీనివాసులు, కె.రామకృష్ణయ్య నేతృత్వంలో 20 మంది కళాకారులు వివిధ దేవతామూర్తులు, దశావతారాల ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా, ఏపీ, తెలంగాణకు చెందిన పలు బృందాలు కోలాటం, జానపద నృత్యం ప్రదర్శించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.