THEORETICAL AND PRACTICAL SESSIONS ENLIGHTEN TTD WOMEN EMPLOYEES IN CANCER AWARENESS PROGRAM_ అవగాహనే క్యాన్సర్ కు మందు – టాటా క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ కార్తీక్

TIRUPATI, 08 OCTOBER 2022: The three-day awareness program on Cancer for TTD women employees has entered the second day on Saturday at Mahati Auditorium in Tirupati.

In the morning session renowned oncologists from Sri Venkateswara Institute of Cancer Care and Advanced Research (SVICCAR), Tirupati explained in detail about Breast, Cervical and Ovarian cancers which are most common among women with the help of a PowerPoint Presentation. They also briefed on the importance of self-examination of the breast which helps in early spotting of breast cancer and in its treatment.

Later Dr Muralikrishna, Principal of SV Ayurvedic College of TTD narrated the natural herbal medicines and Panchagavya treatment available in Ayurveda which avoids humans from becoming prey to cancerous tumours. He made the references from Sushruta and Charaka Samhita.

The morning session concluded with Clinical Psychologist Dr Anupama the emotions and stress that a cancer patient undergoes during his or her journey with the disease and its treatment. She said the support from family, near and dear will provide them to overcome the trauma and also help speedy recovery.

The afternoon session commenced with the practical experiences shared by the cancer survivors Dr Kusuma, Retired Professor in SV University, Dr Padamaja, CPDO of Puttur which enlightened and inspired women folk about the ways to fight against the hazardous disease.

Dr Rani Sada Siva Murty of National Vedic University explained on the importance of women’s health mentioned in Vedas.

The day-two concluded with Maharshi Ayurvedic Institute, Hyderabad Technical Director Dr JR Raju and Mahardhi Vedic University Project Director, Holland Sri Sekhar Reddy, and their team practiced Transcendental Meditation with the women participants and also explained practically about Nadi Vaidyam and other ancient methods of Ayurveda which impressed the women employees.

Dr Harshavardan Raju, Dr Pavani, Tirupati Co-ordinator Smt Sandhya were also present. SVETA Director Smt Prasanti was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అవగాహనే క్యాన్సర్ కు మందు

– టాటా క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ కార్తీక్

– మహతిలో రెండో రోజుకు చేరిన అవగాహన కార్యక్రమం

తిరుపతి, 08 అక్టోబరు 2022: శరీరంలో జరుగుతున్న మార్పులను గుర్తించి సరైన అవగాహనతో ముందుకు వెళ్ళడమే క్యాన్సర్లకు నిజమైన మందు అని టాటా క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ కార్తీక్ అన్నారు. శ్వేత ఆధ్వ‌ర్యంలో తిరుప‌తిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో టిటిడి మ‌హిళా ఉద్యోగుల‌కు క్యాన్స‌ర్‌పై నిర్వహిస్తున్న అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం శనివారం రెండో రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా ఆంకాలజిస్టులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ క్యాన్సర్ వచ్చిన వారు మరణిస్తారని భావించకూడదని, నిపుణులైన వైద్య సిబ్బంది సహాయం, అత్యాధునిక చికిత్స మార్గాలు, సౌకర్యాలతో బాధితులు పూర్తిగా కోలుకోవచ్చని తెలిపారు. భారతదేశంలో మహిళలు ప్రధానంగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సాధారణంగా 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలకు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ రావచ్చని, అయితే ఏ వయసులోనైనా, ఏ సమయంలోనైనా మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడవచ్చని చెప్పారు. నిర్దిమైన లక్షణాలు, మామోగ్రామ్ పరీక్షల ద్వారా గుర్తించి చికిత్స చేయించు కోవాలన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే నిర్ధారణ చేస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు.

అనంతరం ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆయుర్వేదంలో క్యాన్సర్ నివారణ చికిత్సలను తెలియజేశారు. అమర హాస్పిటల్ క్లినికల్ సైకాలజిస్టు శ్రీమతి అనుపమ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అవలంభించే క్లినికల్ సైకాలజీ పద్ధతులను తెలియజేశారు. రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీమతి కుసుమ, పుత్తూరు సిడిపిఓ శ్రీమతి కె.పద్మజ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని జయించిన పలువురు మహిళల అనుభవాలను వీడియోల ద్వారా తెలియజేశారు.

ఆ తరువాత తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అచార్యులు డాక్టర్ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ వేదాల్లో మహిళల ఆరోగ్యం అనే అంశంపై వివరించారు. మహర్షి వేదిక్ యూనివర్సిటీ ప్రతినిధులు మహిళల ఆరోగ్యానికి, కాన్సర్ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని ప్రయోగాత్మకంగా తెలియజేశారు. యూనివర్సిటీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ శేఖర్ రెడ్డి, మహర్షి ఆయుర్వేదిక్ సంస్థ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ జెఆర్.రాజు భావాతీత ధ్యానం, నాడీ వైద్యాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపారు. మహిళల చేత చేయించారు. మహిళలు ప్రతిరోజు 15 నిమిషాలపాటు వీటిని సాధన చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జెఆర్.రాజు మాట్లాడుతూ ప్రస్తుతం విదేశాల్లో భారతీయ వైద్య విధానాలైన ఆయుర్వేదం, యోగాపై ఆసక్తి పెరుగుతోందని, దాదాపు 15 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలియజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్వేత సంచాల‌కులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి, మహర్షి ఆయుర్వేదిక్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ పావని, తిరుపతి కో ఆర్డినేటర్ శ్రీమతి సంధ్య, పెద్ద సంఖ్య‌లో టిటిడి మ‌హిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.