THIRD PHASE SRINIVASA SETU IN JAN -TTD CHAIRMAN _ జనవరి కి శ్రీనివాస సేతు మూడో దశ నిర్మాణం పూర్తి – టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

TIRUPATI, 05 OCTOBER 2022: The third phase of Srinivasa Setu works will be completed by January next, said TTD Chairman Sri YV Subba Reddy.

Opening the Second phase road from Leela Mahal to Srivari Sannidhi, along with local MLA Sri B Karunakar Reddy, the Chairman said if the third phase also gets opened, Tirupati denizens will be free from traffic woes.

Travelling on the newly opened flyover, the Chairman said this would facilitate devotees coming from Vijayawada, Chennai, Hyderabad to travel without traffic issues.

Tirupati MP Dr Gurumurthy, Mayor Dr Sirisha, APCON Manager Sri Rangaswamy and other dignitaries present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి కి శ్రీనివాస సేతు మూడో దశ నిర్మాణం పూర్తి- టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 5 అక్టోబరు 2022: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు, తిరుపతి వాసుల ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తొలగించేలా శ్రీనివాస సేతు మూడో దశ నిర్మాణం పనులు జనవరి కి పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

లీలామహల్ సమీపం నుంచి శ్రీవారి సన్నిధి వరకు నిర్మించిన రెండో దశ శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ను బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. తొలుత శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్ర పటానికి పూజలు చేశారు.అనంతరం చైర్మన్, ఎమ్మెల్యే ఫ్లై ఓవర్ పై ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్, విజయవాడ, చెన్నై మార్గాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఈ ఫ్లై ఓవర్ ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వారు నేరుగా కపిలతీర్థం చేరుకోవచ్చని ఆయన తెలిపారు. మూడో విడత నిర్మాణం పనులు కూడా జనవరికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు.

శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ, టీటీడీ చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి ప్రత్యేక శ్రద్ధ తోనే శ్రీనివాస సేతు రెండు దశల నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు. జనవరికి తిరుచానూరు మార్గం నుంచి కూడా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

ఎంపి డాక్టర్ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు శ్రీ భూమన అభినయ్, శ్రీ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు శ్రీ ఎస్ కె బాబు, శ్రీ కె. ఆంజనేయులు, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ ఈ శ్రీ మోహన్, కార్పొరేషన్ ఇంజినీర్ శ్రీ చంద్రశేఖర్, ఆప్కాన్ సంస్థ మేనేజర్ శ్రీ రంగ స్వామి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది