THREE DAY AND FOUR DAY SEVA FOR YOUTH AND EMPLOYED-TIRUMALA JEO_ శ్రీవారిసేవలో వ్యక్తిగతంగా సేవచేసే అవకాశం – శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు
Tirumala, 2 November 2017: The newly introduced three-day and four-day seva is aimed at providing opportunity to educated, youth and employed devotees, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.
Addressing srivari sevakulu in seva sadan complex at Tirumala on Thursday evening, the JEO said, introduction of the new sevas does not mean that we have bid adieu to seven day service. “This will have more transparency and aims at strengthening srivari seva”, he observed.
Further he said, the new building exclusively meant for srivari sevakulu will become operational by 2018.
TTD PRO and Srivari Seva Head Dr T Ravi, AEO Sri Gopal Rao, Laision Officer Sri Varaprasad and other staffs, sevakulu were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI
శ్రీవారిసేవలో వ్యక్తిగతంగా సేవచేసే అవకాశం – శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు
నవంబరు 2, తిరుమల 2017: శ్రీవారి సేవలో యువత, ఉద్యోగులను భాగస్వామ్యం చేసేందుకు వీలుగా 3 రోజులు, 4 రోజుల స్లాట్ విధానాన్ని తీసుకువచ్చామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్. శ్రీనివాసరాజు తెలిపారు. ఈ విధానం ద్వారా వ్యక్తిగతంగా సేవలందించేందుకు మార్పులు తీసుకువచ్చామన్నారు. ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న శ్రీవారి సేవా సదన్‌లో గురువారం సాయంత్రం శ్రీవారి సేవకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారి సేవలో ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు వీలుగా 3 రోజులు, 4 రోజుల స్లాట్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చామన్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగస్తులు, యువత సేవలందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో గ్రూప్ విధానం ద్వారా 7 రోజులు సేవ చేసే విధానాన్ని కొనసాగిస్తూనే కొత్త విధానాన్ని అమలు పరుస్తున్నామన్నారు. నూతన విధానం ద్వారా టిటిడిలో ఒకే చోట పలుమార్లు సేవ చేయడం కాకుండా వివిధ శాఖలలో సేవ చేసే అవకాశం ఉంటుందన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవ అందిస్తే శ్రీవారికి సేవ చేసినట్లేనని ఈ సందర్భంగా మాట్లాడారు. 2000 సంవత్సరంలో 192 మందితో ప్రారంభమైన శ్రీవారి సేవ అంచెలంచెలుగా ఎదిగిందన్నారు. ఈ రోజు దాదాపు రోజుకు 2 వేల మంది సేవకులు టిటిడిలోని వివిధ విభాగాలలో సేవలందిస్తున్నారని తెలిపారు.
2018 మార్చి నాటికి శ్రీవారి సేవకులకు నూతన సేవా సదన్ భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఆ భవనంలో స్త్రీలు, పురుషులకు వేరు వేరుగా వసతి సౌకర్యం కల్పిస్తామని, భజనలు, భోజనం, తదితర సౌకర్యాలు నూతన భవనంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీవారి సేవపై గుర్తింపు ఉన్న ప్రముఖులతో శిక్షణా కార్యక్రమాలు చేపడుతామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాసంబంధాల అధికారి డా. టి. రవి, ఏఈవో శ్రీ పి.గోపాల్ రావు, సత్యసాయి కోఆర్డినేటర్ శ్రీ వరప్రసాద్, సత్యసాయి ఓఎస్‌డిలు శ్రీ డిఎల్‌ఎన్ ప్రసాద్, శ్రీ పణిరంగసాయి, శ్రీ శ్రీధర్ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.