THREE DAY CANCER AWARENESS PROGRAMME FOR TTD WOMEN CONCLUDES ON A SUCCESSFUL NOTE _ స్త్రీ ఆరోగ్యం తోనే సుసంపన్న సమాజం : టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్

WOMEN ARE THE BACKBONE FOR A HEALTHY SOCIETY-TTD BOARD MEMBER

 

SCREENING FOR ALL WOMEN FOLK OF TTD ON NOVEMBER 7-JEO (H & E)

 

TIRUPATI, 09 OCTOBER 2022: A society will be healthy and wealthy only when the woman of the family is healthy, said TTD Trust Board Member Sri Pokala Ashok Kumar.

 

Addressing the valedictory session of the three-day Cancer Awareness Programme for Women Employees’ of TTD organized under the aegis of Sri Venkateswara Employees’ Training Academy(SVETA) of TTD in Mahati Auditorium in Tirupati on Sunday, Sri Ashok called upon the women employees of TTD to follow healthy and hygienic food habits. “Women always think about the welfare of their family and ignore their personal health. I request all the women to spare at least an hour for themselves and do exercise or yoga and meditation or walking to keep physically and mentally fit. “The country will prosper only when the women in the families are healthy”, he asserted.

 

He poured in appreciation on JEO for Health and Education Smt Sada Bhargavi and her team for making the three-day event a humongous success. 

 

Speaking on the occasion, the JEO(H & E) said, following the instructions of TTD Chairman Sri YV Subba Reddy and EO Sri AV Dharma Reddy, this Never Before Ever After-massive awareness programme on Cancer exclusively for women employees of TTD has been designed inviting eminent doctors and speakers and the programme was inaugurated by the Cancer Survivor and Life Again Foundation Founder and film actress Smt Goutami Tadimalla. She complimented all the 1540 odd women employees’ of TTD who took part in the three-day awareness camp on Cancer. “As women are more prone to Breast, Cervical, Ovarian cancers, this three-day programme will be of great use to keep not only yourselves fit but in making the society also healthy”, she maintained. She said, as November 7 is being observed as World Cancer Day, all the women employees will be screened with the help of TATA Cancer and SVIMS Hospitals.

 

She said, during all three days, women employees who are posted outside the state at Vellore, Keesaragutta have also participated and especially the Class IV staff also took part in the event with great enthusiasm. She thanked all the departments, union leaders for taking the initiative in sending every woman employee to attend the programme which is beneficial for them.

 

Earlier Dr Sivakumar, Medical Superintendent from TATA Cancer Hospital also spoke on the occasion while in the morning session, Smt P Deepti, Nutritionist and Women Wellness Consultant, Dr Narappa Reddy, Technical Supervisor of TTD-run Sri Srinivasa Ayurveda Pharmacy also spoke on the importance of diet for cancer patients and Home-made remedies to avoid cancer respectively which enlightened the participants.

 

The dance ballet by the students of SV College of Music and Dance in between the morning and afternoon sessions was an added attraction.

 

SVETA Director Smt Prasanti, Special Grade DyEOs, DyEOs, Senior Officers from Engineering, Medical departments, HoDs, women employees, were present in the programme.

 
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్త్రీ ఆరోగ్యం తోనే సుసంపన్న సమాజం : టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్

-. నవంబర్ 7న టీటీడీ మహిళా ఉద్యోగుల కోసం స్క్రీనింగ్ పరీక్ష :
జె ఈవో శ్రీమతి సదా భార్గవి

– ముగిసిన మూడు రోజుల క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

తిరుపతి 9 అక్టోబరు 2022: స్త్రీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా,  సు సంపన్నంగా ఉంటుందని టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ అన్నారు.

తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో శ్వేత ఆధ్వర్యంలో టీటీడీలోని మహిళా ఉద్యోగులకు మూడు రోజుల పాటు నిర్వహించిన క్యాన్సర్‌పై అవగాహనా కార్యక్రమం ఆదివారం ముగిసింది . ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ అశోక్ కుమార్ మాట్లాడుతూ , ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారపు అలవాట్లను పాటించాలన్నారు. మహిళలు ఎల్లప్పుడూ తమ కుటుంబ సంక్షేమం గురించి ఆలోచిస్తూ , వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని విస్మరిస్తారని చెప్పారు . మహిళలందరూ తమ కోసం కనీసం ఒక గంట సమయం కేటాయించాలని, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటానికి వ్యాయామం ,యోగా , ధ్యానం లేదా వాకింగ్ చేయాలని కోరారు . కుటుంబాల్లోని మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు .

మూడు రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జెఈవో శ్రీమతి సదా భార్గవి , ఆమె బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.

జెఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ , క్యాన్సర్‌పై మూడు రోజుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీలోని 1540 మంది మహిళా ఉద్యోగులను అభినందించారు. మహిళలు రొమ్ము, గర్భాశయ, అండాశయ క్యాన్సర్‌లకు గురయ్యే అవకాశం ఉన్నందున, మూడు రోజుల కార్యక్రమం వారికి పూర్తి అవగాహన కల్పించుకోవడానికి ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు . మహిళలు తాము ఆరోగ్యాంగా ఉండటమే కాకుండా , సమాజాన్ని కూడా ఆరోగ్యంగా మార్చడానికి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె చెప్పారు . నవంబర్ 7వ తేదీని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటున్నందున, టాటా క్యాన్సర్ , స్విమ్స్ ఆసుపత్రుల సహాయంతో మహిళా ఉద్యోగులందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు.

వేలూరు, కీసరగుట్టలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు . తమకు ఉపయోగపడే కార్యక్రమానికి ప్రతి మహిళా ఉద్యోగిని పంపించడంలో చొరవ చూపినందుకు హెచ్ ఓడి లకు అన్ని యూనియన్ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

అంతకుముందు టాటా క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివకుమార్ ప్రసంగించారు . ఉదయం సెషన్‌లో న్యూట్రిషనిస్ట్, ఉమెన్ వెల్నెస్ కన్సల్టెంట్ శ్రీమతి పి దీప్తి, టిటిడి శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీ టెక్నికల్ సూపర్‌వైజర్ డాక్టర్ నారపరెడ్డి మాట్లాడారు. చివరగా మహిళా ఉద్యోగులందరికీ క్యాన్సర్ పై అవగాహనకు సంబంధించి 20 ప్రశ్నలకు జవాబులు సేకరించగా అందరికీ 18 మార్కులకు పైగా రావడం విశేషం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన డ్యాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి సీనియర్ అధికారులు, పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది