THREE DAY RELIGIOUS CONCLAVE COMMENCES IN TIRUMALA _ ఘనంగా శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభం

ASTANA MANDAPAM DONS SPIRITUAL LOOK

 

25 PEETHADHIPATHIS GRACE THE FIRST DAY SADAS

 

TIRUMALA, 03 FEBRUARY 2024: The three-day Dharmika Sadas organised by TTD under the aegis of its Hindu Dharma Prachara Parishad commenced on a grand spiritual note at Astana Mandapam in Tirumala on Saturday.

 

A total of 25 Peethadhipathis graced the first day of the conclave who were received with the traditional Purnakumbha Swagatam and received by TTD Trust Board Chairman Sri Bhumana Karunakara Reddy along with TTD EO Sri AV Dharma Reddy. The Pontiffs who hailed from various mutts across the country, provided their valuable suggestions to TTD for taking forward the Hindu Santana Dharma in a more effective way through a series of Dharmic programmes.

 

SPIRITUAL VIBES

 

The entire premises of Astana Mandapam in Tirumala was spruced up with electrical illumination and colourful floral decorations which enhanced the spiritual atmosphere. The replicas of Srivari Vajra Kireetam, Om Karam in electrical decors, floral structures of Tirunamam – Shanku – Chakra, dioramas of Dasavatara, horses, elephants, Cow and Calf, replica of Ananda Nilaya etc. glorified the ambience of the Sadas.

 

The conclave commenced with the Jyothi Prajwalana-lighting of the lamp by HH Sri Pedda Jeeyar and HH Sri Chinna Jeeyar Swamijis of Tirumala along with the Chairman and EO followed by Veda Swasti. Sri Pedda Jeeyar Swamy in his Anugraha Bhashanam wished that the Dharmika Sadas would become a platform to implement more Dharmic programmes by TTD with the valuable suggestions by the various Pontiffs who hailed from different places across the country.

 

Among the Pontiffs who graced the first day of Veda Sadas held Astana Mandapam includes:

 

HH Tirumala Sri Sri Pedda Jeeyar Swamy, HH Tirumala Sri Sri Chinna Jeeyar Swamy, Sri Sri Vidya Shreesha Theertha of Vyasaraja Mutt, Sri Bharati Theertha Swamy of Kurtalam, Sri Swaswarupanandagiri Swamy of Sri Lalita Peetham, Sri Paripoornandagiri Swamy of Erpedu Vysasramam, Sri Vidyaprasanna Theertha Swamy of Kukke Subramanya Mutt, Sri Virajanda Swamy of Brahmagari Mutt, Kadapa, Sri Viswayogi Viswamji of Guntur, Sri Sachidananda Saraswati Swamy of Tuni Tapovanam, Sri Hari Theertha Swamy of Satyananda Asramam, Nellore, Sri Sri Prakashananda Saraswati Swami of Gnana Saraswati Peetha, Vijayawada, Chaitanya Tapovanam Mata Sivananda Saraswati, Mata Sushrusananda, Shiva Darshan Mataji of Proddutur, Sri Sri Sri Stitha Pragnananda Saraswati Swami of Uttarkashi, Sri Sri Satyananda Bharti of Chidananda Ashram Vijayawada, Shaivakshetra Sri Shiva Swamy of Guntur, Sri Devanatha Ramanuja Jeeyar Swamy of Hyderabad Sri Swatmanandendra Saraswati Swamy of Visakha Sarada Peetham.

 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఘనంగా శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభం

•⁠ ⁠మొదటి రోజు 25 మంది స్వామీజీల అనుగ్రహ భాషణం

 ఫిబ్రవరి 03, తిరుమల, 2024: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 5 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది.

మొదటిరోజు సదస్సుకు 25 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు. స్వామీజీలకు టీటీడీ జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, సీఈ నాగేశ్వరరావు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ ఇతర అధికారులు మంగళవాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి సమర్పించారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలనతో ధార్మిక సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి చెందిన వేద పండితులు వేద స్వస్తి నిర్వహించారు.

అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి కార్యక్రమ సందర్భ పరిచయం చేశారు. ఆ తర్వాత టీటీడీ ధార్మిక కార్యక్రమాలపై శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ రూపొందించిన 40 నిమిషాల ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ప్రదర్శించారు.

ఆ తర్వాత స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు తమ అనుగ్రహ భాషణాన్ని అందించారు. స్వామీజీల వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి,

తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి,

బెంగళూరు శ్రీ వ్యాసరాజ మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థ స్వామీజీ,

కుర్తాళం మౌనస్వామి మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతిస్వామి,

తిరుపతి రాయలచెరువుకు చెందిన భారతి శక్తిపీఠం మాతృశ్రీ రమ్యానంద,

విజయవాడకు చెందిన శ్రీశ్రీశ్రీ అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి,

భీమవరానికి చెందిన భాష్యకార సిద్ధాంత పీఠం శ్రీశ్రీశ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి,

శ్రీనివాసమంగాపురానికి చెందిన శ్రీ లలితా పీఠం శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామి,

ఏర్పేడు వ్యాసాశ్రమానికి చెందిన శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానందగిరి స్వామి,

కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రసన్నతీర్థ స్వామీజీ,

కడప బ్రహ్మంగారి మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ విరజానంద స్వామి,

గుంటూరుకు చెందిన శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజి,

తుని తపోవనానికి చెందిన శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి,

నెల్లూరుకు చెందిన సత్యానంద ఆశ్రమం శ్రీశ్రీశ్రీ హరితీర్థ స్వామీజీ,

విజయవాడలోని జ్ఞాన సరస్వతి పీఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ ప్రకాశానంద సరస్వతి స్వామి,

తేనెపల్లికి చెందిన చైతన్య తపోవనం మాతా శివానంద సరస్వతి,

మాతా సుశ్రుశానంద,

ప్రొద్దుటూరుకు చెందిన శివ దర్శనం మాతాజీ,

ఉత్తరకాశీకి చెందిన శ్రీశ్రీశ్రీ స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామి,

విజయవాడకు చెందిన చిదానంద ఆశ్రమం శ్రీశ్రీశ్రీ సత్యానంద భారతి,

గుంటూరుకు చెందిన శైవక్షేత్రం శ్రీ శివ స్వామి,

హైదరాబాదుకు చెందిన శ్రీశ్రీశ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి,

విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి.

ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు శ్రీ యానాదయ్య, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ సోమయాజులు, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, శ్వేత డైరెక్టర్ శ్రీ భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.