THREE DAY SNAPANAM CONCLUDES _ మూడవరోజు వైభవంగా శ్రీవారి స్నపన తిరుమంజనం

DIVINE “SPICY” TREAT 

TIRUMALA, 07 OCTOBER 2024: The three-day Snapana Tirumanjanam concluded in a spectacular way at Ranganayakula Mandapam on Monday.

The sacred aromatic bath to the utsava deities which commenced at 1pm lasted for about two hours. The Veda Parayanamdars chanted Sri Suktam, Bhu Suktam, Purusha Suktam, Narayana Suktam and Neela Suktam in a rhythmic manner.

On the third day, the deities of Sri Malayappa along with Sridevi and Bhudevi were decked with spicy garlands and crowns after the completion of every aromatic bath. 

Cloves, Cardamom, figs, pistachios besides rose petals and straw berries decorated the utsava murthies in an attractive manner.

TTD EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మూడవరోజు వైభవంగా శ్రీవారి స్నపన తిరుమంజనం

తిరుమల, 2024 అక్టోబ‌రు 07: మూడవ రోజు స్నపన తిరుమంజనం సోమవారం రంగనాయకుల మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది.

మధ్యాహ్నం 1గంటకు ప్రారంభమైన ఉత్సవమూర్తులకు పవిత్ర సుగంధ స్నానం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. వేదపారాయణమారులు శ్రీ సూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, నీలా సూక్తాలను లయబద్ధంగా ఆలపించారు.

మూడవ రోజు సుగంధ స్నానం పూర్తయిన తర్వాత శ్రీదేవి మరియు భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని విశేషమైన పూలమాలలు మరియు కిరీటాలతో అలంకరించారు.

లవంగాలు, ఏలకులు, అంజీర, పిస్తాతో పాటు గులాబీ రేకులు, స్ట్రాబెర్రీలతో ఉత్సవ మూర్తులను ఆకర్షణీయంగా అలంకరించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.