THREE TAKE OATH _ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ విశ్వ‌నాథ్‌, శ్రీ కేత‌న్ దేశాయ్‌, శ్రీ విద్యాసాగ‌ర్ ప్రమాణస్వీకారం

TIRUMALA, 27 SEPTEMBER 2021: Three more take oath as TTD Board members on Monday in Srivari temple at Tirumala.

 

Sri Viswanath, Sri Ketan Desai, Sri Kalvakuntla Vidyasagar Rao took oath at Bangaru Vakili inside temple.

 

TTD Additional EO administered the oath of office with them in the presence of Sri Venkateswara Swamy.

 

After darshan they were rendered Veda Ashirvachanam and offered Theertha prasadams at Ranganayakula Mandapam.

 

Deputy EOs Sri Ramesh Babu, Smt Sudharani, temple Peishkar Sri Srihari were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ విశ్వ‌నాథ్‌, శ్రీ కేత‌న్ దేశాయ్‌, శ్రీ విద్యాసాగ‌ర్ ప్రమాణస్వీకారం

తిరుమల, 2021 సెప్టెంబ‌రు 27: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సభ్యులుగా శ్రీ విశ్వ‌నాథ్‌, శ్రీ కేత‌న్ దేశాయ్‌, శ్రీ విద్యాసాగ‌ర్ సోమ‌వారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీమతి సుధారాణి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.