జూలై 9న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అక్టోబర్ నెల కోటా విడుదల
జూలై 9న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అక్టోబర్ నెల కోటా విడుదల
తిరుమల, 2019 జూలై 06: భక్తుల సౌకర్యార్థం 2019 అక్టోబర్ నెల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 9న టిటిడి విడుదల చేయనుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్, ఈ-దర్శన్ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.