TIME SLOTS TO ENABLE CONVENIENT DARSHAN TO PILGRIMS-TIRUMALA JEO_ సర్వదర్శనం భక్తుల టైమ్‌స్లాట్‌ కౌంటర్లను పరిశీలించిన జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

WHIRL WIND INSPECTION BY TIRUMALA JEO TO SSD COUNTERS

Tirumala, 28 Nov 2017: The time-slot system will enable convenient darshan to pilgrims reducing the waiting hours in Tirumala said, Tirumala JEO Sri KS Sreenivasa Raju.

During his whirlwind inspection to Slotwise Sarva Darshan (SSD) counters in Tirumala on Tuesday, the JEO instructed the engineering officials to complete the counter works on a fast pace in all the 14 locations during the first phase.

Later briefing the media persons in APSRTC bus stand where temporary SSD counter is coming up, the JEO said, the time slot darshan was first introduced in August 2014 for Rs.300 Special Entry Darshan(SED). This year on July 17, we have introduced the slot wise darshan for 20 thousand Divya Darshan (pedestrian) pilgrims which has also yielded good results”, he added
Under the instructions of Honourable CM of AP Sri N Chandrababu Naidu who is particular about the best possible way providing hassle free darshan to multitude of visiting pilgrims, the Time slot has been enabled in TTD. On a trial basis for five to ten days, in the second week of December, the time slot for Sarva Darshan pilgrims will be experimented in 107 counters located in 14 areas in Tirumala during first phase. After trial run, the pros and cons will be enlisted and the SSD will be launched in a full-fledged way in 150 counters in Tirumala before summer vacation as per the directives of TTD EO Sri Anil Kumar Singhal”,he informed.

Earlier the JEO inspected the progress of civil works in various locations near Varahaswamy Rest House, Sannidhanam, ANC KKC, Padmavathi area and RTC bus stand.

SE II Sri Ramachandra Reddy, GM Sri Sesha Reddy, DyEOs Sri Kodanda Rama Rao, Sri Venugopal, VGO Sri Ravindra Reddy, EEs Sri Prasad, Sri Srinivasa Rao, DE Electrical Smt Saraswathi and other officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం

సర్వదర్శనం భక్తుల టైమ్‌స్లాట్‌ కౌంటర్లను పరిశీలించిన జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 2017 నవంబరు 28: సర్వదర్శనం భక్తులకు టైమ్‌స్లాట్‌ విధానం ద్వారా నిర్ణీత వ్యవధిలో శ్రీవారి దర్శనం చేయించేందుకు మొదటివిడతలో 107 కౌంటర్ల ద్వారా టోకెన్లు కేటాయిస్తామని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలో సర్వదర్శనం భక్తుల టైమ్‌స్లాట్‌ కౌంటర్ల వద్ద జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులను మంగళవారం జెఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ భక్తులకు సులభతరంగా శ్రీవారి దర్శనం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు సర్వదర్శనం విధానంలో మార్పులు తీసుకొస్తున్నట్టు తెలిపారు. సర్వదర్శనం భక్తులకు డిసెంబర్‌ రెండో వారం నుండి ప్రయోగాత్మకంగా టోకెన్లు మంజూరుచేసి 5 నుంచి 10 రోజుల పాటు పరిశీలిస్తామమన్నారు. లోటుపాట్లను సవరించుకుని వేసవి లోపు పూర్తిస్థాయిలో టైమ్‌స్లాట్‌ విధానం ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. ఈ కౌంటర్ల వద్ద భక్తులు తమ ఆధార్‌ కార్డును చూపి టోకెన్లు పొందవచ్చన్నారు. ఆధార్‌ కార్డు తిరుమలకు తీసుకురాని భక్తులు ప్రస్తుతం ఉన్న సర్వదర్శనం విధానంలోనే స్వామివారి దర్శించుకోవచ్చన్నారు. వీరు నారాయణగిరి గార్డెన్స్‌ అనుకుని ఉన్న ఆళ్వార్‌ట్యాంక్‌ వద్ద క్యూలైన్లలోనికి ప్రవేశించి, అక్కడ నుండి కంపార్టుమెంట్లలోనికి ప్రవేశిస్తారని వివరించారు. 2014, ఆగస్టు నుండి ప్రవేశ పెట్టిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనంతో భక్తులు తక్కువ వ్యవధిలో శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా నడకదారి భక్తులకు 2017, జూలై 17వ తేదీ నుండి ప్రతిరోజూ 20 వేల టికెట్లను టైమ్‌స్లాట్‌ విధానం ద్వారా కెేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ విధానం ద్వారా భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా, సంతృప్తికరంగా స్వామివారి దర్శనం చేసుకుంటునట్లు వివరించారు.

సర్వదర్శనం కౌంటర్ల ఏర్పాటు కోసం తిరుమలలోని 14 ఆధిక రద్దీగల ప్రాంతాలను ఎంపిక చేశామని, ప్రస్తుతం 11 ప్రాంతాల్లో కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని జెఈవో తెలిపారు. సిఆర్‌వో – 10, ఆర్‌టిసి బస్టాండ్‌ – 10, సప్తగిరి సత్రాలు – 10, సన్నిధానం – 5, ఏఎన్‌సి – 8, పద్మావతి విచారణ కార్యాలయం సమీపంలో 6, ఎటిసి – 4, ఎంబిసి – 4, వరాహస్వామి విశ్రాంతి గృహం-1 వద్ద 7, నందకం – 5, కల్యాణ వేదిక – 6, గాలిగోపురం – 14, శ్రీవారి మెట్టు – 4, ఎటిసి జనరేటర్‌ – 14 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాలలో ఇదివరకే ఉన్న భవనాలను ఇందుకోసం వినియోగిస్తునట్లు తెలిపారు. నూతనంగా ప్రవేశపెట్టనున్న సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ విధానంపై భక్తుల అభిప్రాయాలు సేకరించి, అందుకు తగిన విధంగా మార్పులు తీసుకువచ్చి 150 కౌంటర్లు ఏర్పాటుచేస్తామని చెప్పారు.

అంతకుముందు సన్నిధానం, పద్మావతి విశ్రాంతి భవనాల సముదాయం, వరాహస్వామి విశ్రాంతి గృహాల వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులను జెఈవో పరిశీలించారు.

జెఈవో వెంట టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీకోదండరామరావు, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.