ANGAPRADAKSHINA TOKENS FROM JULY 1 in SRI PAT_ జూలై 1 నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీ
Tiruchanoor, 29 Jun 19:Henceforth the Angapradakshinam tokens will be issued in Sri Padmavathi Ammavari temple in Tiruchanoor from July 1 onwards.
Everyday 100 tokens will be allowed while on Friday 150 tokens will be allowed and the tokens will be issued the previous day.
The devotees have to show their Aadhaar or Voter or Driving Licence or Passport or PAN card to get the tickets. While every day the devotees are allowed for Angapradakshinam at 4.30am, on Fridays will be allowed at 3.30am.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 1 నుండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీ
జూన్ 29, తిరుపతి, 2019: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 1 నుండి అంగప్రదక్షిణ చేయు భక్తులకు ముందు రోజు సాయంత్రం టోకెన్లను జారీ చేస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు, శుక్రవారం మాత్రము 3.30 గంటలకు భక్తులను ఆలయంలో అంగప్రదక్షిణకు అనుమతిస్తారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చెంత ఉన్న ఆస్థానమండపం సెల్లార్‌లో భక్తులు వేచి ఉండేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన హాల్‌లోని కౌంటర్ల నందు టోకెన్లు ఉచితంగా మంజూరు చేస్తారు. ఇందులో భాగంగా సోమ, మంగళ, బుధ, గురు, శని, ఆదివారాలలో 100 టోకెన్లు, శుక్రవారం అంగప్రదక్షిణ చేసేవారికి 150 టోకెన్లు ఇస్తారు. భక్తులు ఏదైన గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్, పాసుపోర్టు, పాన్‌కార్డు తదితర) చూపించి టోకెన్లు పొందవచ్చు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.