ELABORATE ARRANGEMENTS FOR AMMAVARI BRAHMOTSAVAMS-TTD CHAIRMAN _ తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు : టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి
RELEASES ANNUAL FETE BOOKLET
TIRUPATI, 30 OCTOBER 2023: Elaborate arrangements are underway to celebrate the Navahnika Brahmotsavams of Sri Padmavathi Ammavaru in Tiruchanoor from November 10 to 18 in a grand manner, said TTD Trust Board Chairman Sri Bhumana Karunakara Reddy.
The Chairman along with the TTD EO Sri AV Dharma Reddy released the book let of
the annual brahmotsavams in Tiruchanoor temple on Monday.
Speaking on the occasion, he said, TTD has observed the Tirumala brahmtosavams in a big way and is now set for Ammavari Brahmotsavams. “All the officials are gearing up for the big festival under the leadership of TTD EO. Even the TTD board has also sanctioned Rs.9crores towards the beautification of the Padma Sarvoram and the works are nearing completion”, he added.
Adding further he said, the traditional temple cleansing ritual of Koil Alwar Tirumanjanam will be held on Novembe 7, Laksha Kumkumarchana and Ankurarpanam on November 9, Dhwajarohanam on November 10. The other important days during the nine day Brahmotavams includes, Gaja Vahanam on November 14, Swarna Ratham and Garuda Seva on November 15, Rathotsavam on November 17 and Panchami Theertham on November 18. The annual Pushpa Yagam will be observed on November 19.
TTD has cancelled all Arjita Sevas, Kumkumarchana, Vedaseervachanam and VIP Break during the Brahmotsavam period in the temple.
TUDA Chairman and TTD ex-officio Board member Sri Mohit Reddy, JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, Deputy EO Sri Govindarajan and others were also present.
తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు : టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి
– వాహనసేవల బుక్ లెట్ ఆవిష్కరణ
తిరుపతి, 2023 అక్టోబరు 30: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్నాయని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు . తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో వీటిని వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదుట సోమవారం అమ్మవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల బుక్ లెట్ ను ఛైర్మన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడారు . బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 7వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందన్నారు. నవంబరు 9వ తేదీన లక్షకుంకుమార్చన, అంకురార్పణ నిర్వహిస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా నవంబరు 10న ధ్వజారోహణం, 14న గజ వాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పుష్పయాగం నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయన్నారు. విశేషమైన పంచమి తీర్థం నాడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరిస్తారన్నారు . ఇందుకోసం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామని వివరించారు. దాదాపు రూ.9 కోట్ల వ్యయంతో అమ్మవారి పుష్కరిణి ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, త్వరలో నీటిని నింపి పుష్కరిణి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ ఏఈవో శ్రీ రమేష్, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, శ్రీ మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.