TIRUCHI SEVA HELD _ తిరుచ్చిపై సోమస్కందమూర్తి

TIRUPATI, 15 FEBRUARY 2023: On the fifth day morning on Wednesday as part of ongoing annual brahmotsavams at Sri Kapileswara Swamy temple Sri Somaskanda Murty along with Kamakshi Devi atop Tiruchi blessed devotees all along the streets.

Temple DyEO Sri Devendra Babu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుచ్చిపై సోమస్కందమూర్తి

తిరుపతి, 15 ఫిబ్రవరి 2023:  తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కంధమూర్తి తిరుచ్చిపై  అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.

మహాదేవుడైన కపిలేశ్వరస్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచ్చి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరతాయని ఐతిహ్యం.

అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.