TIRUMALA GLOWS IN DIVINE RADIANCE ON KARTHIKA POURNAMI _ శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం
KARTHIKA PARVA DEEPOTSAVAM OBSERVED
Tirumala, 24 November 2026: The Salakatla Karthika Parva Deepotsavam was observed with religious fervour with tens of hundreds of illuminated ghee lit lamps in Srivari Temple enhancing spiritual splendour on Tuesday evening.
Besides the main temple, the ghee lamps were lit in special ‘Mookullu’ at almost 100 places within and outside Tirumala temple on the occasion covering all the sub shrines.
HH Sri Pedda Jeeyar Swami and HH Sri Chinna Jeeyar Swami of Tirumala former Chief Justice of India Justice N.V. Ramana, TTD Specified Authority Chairman and EO Sri Muddada Ravichandra, Additional EO Sri Ch. Venkaiah Chowdary, CV&SO Sri Murali Krishna, Deputy EO Sri Bhaskar, temple priests and officials attended the event.
In the wake of this religious ceremony, TTD has cancelled the monthly Pournami Garuda Seva and Sahasra Deepalankara Seva.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం
తిరుమల, 2026 నవంబర్ 24: తిరుమల శ్రీవారి అలయంలో మంగళవారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆతర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల నడుమ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు.
శ్రీవారి ఆలయంలో కార్తీకదీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు.
కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది.
ఈ కార్తీక దీపోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ, టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ మరియు ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ శ్రీ భాస్కర్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.















