TIRUMALA JEO FELICITATES STAFFS OF AUCTION DEPARTMENT _ తలనీలాల ఆదాయం పెంపునకు కృషి చేసిన సిబ్బందికి జెఈవో సన్మానం

Tirumala, 18 Sep: As a token of appreciation to the efforts of the crew of the Auction wing of TTD in helping the temple administration to reap huge profits out of the sale of human hair through e-Auction, Tirumala JEO Sri KS
Sreenivasa Raju felicitated the staff of the department at Annamaiah Bhavan in Tirumala on Wednesday.
 
Later addressing the gathering he said, with the introduction of e-Auction of human hair, it not only enhanced transparency in the system of human hair auctioning but also garnered huge profits to TTD.
 
“From the past two years we have been selling the human hair through e-Auction. Prior to it TTD used to receive only 60-70crores out of the sale of human hair. But during last year it was 204 cr, while this year, for six months itself the turnover stood at whopping 108crores.
 
Thanks to the efforts putforth by the staffs of Auctions department especially the labour who worked day and night in categorising the human hair with qualitative approach”, he added.
 
JEO also appreciated Auctions and FMS EE Sri Subramanyam, Dy EE Sri Satyam and other staff members for their stupendous performance.
 
Later he gave away certificates of appreciation and a cash award of Rs.1000 to 39 labour for their tireless efforts.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తలనీలాల ఆదాయం పెంపునకు కృషి చేసిన సిబ్బందికి జెఈవో సన్మానం

తిరుమల, సెప్టెంబరు 18, 2013: తలనీలాల వేలంలో ఆదాయం పెంపునకు కృషి చేసిన తితిదే సిబ్బందిని తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సన్మానించారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం విచ్చేస్తున్న వేలాది మంది భక్తులు భక్తిప్రపత్తులతో కొన్ని థాబ్దాలుగా తమ తలనీలాలను సమర్పించుకుంటున్నారు. ఈ తలనీలాల పొడవుననుసరించి వివిధ విభాగాలుగా విభజించి వేలం ద్వారా తితిదే కొన్ని కోట్ల రూపాయలను ప్రతి ఏటా ఆర్జిస్తోంది. రెండేళ్లుగా తితిదే ఈ తలనీలాల వేలం విధానంలో మరింత పారదర్శకత పెంపొందించే రీతిలో ఈ-వేలాన్ని అనుసరించిన విషయం విదితమే. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో చేపట్టిన తలనీలాల ఈ-వేలానికి దేశవ్యాప్తంగా అనూహ్యస్పందన వచ్చింది. తలనీలాల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఏడాదికి రూ.60 కోట్ల నుండి రూ.70 కోట్ల ఆదాయం పండిస్తున్న ఈ ‘నల్లబంగారం’ ద్వారా 2011-12వ ఆర్థిక సంవత్సరంలో రూ.204 కోట్లు, ఈ సంవత్సరంలో ఆరు నెలల కాలానికి రూ.108 కోట్లు తితిదే ఆదాయం ఆర్జించింది. మార్కెటింగ్‌ జనరల్‌ మేనేజర్‌(ఆక్షన్‌) శ్రీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో డెప్యూటీ ఈఈ శ్రీ సత్యం పర్యవేక్షణలో తలనీలాల ఈ-వేలం విధానం జెఈవో ఆదేశాల మేరకు అద్భుతమైన ఫలితాలను అందించింది.

ఈ సందర్భంగా తలనీలాల వేలంలో రెండేళ్లలో అద్భుత ఫలితాలు సాధించిన తితిదే సిబ్బందిని బుధవారం నాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జెఈవో ప్రశంసాపత్రం, నగదు బహుమతితో సన్మానించారు. ముఖ్యంగా తలనీలాలను 1వ, 2వ, 3వ, 4వ, 5వ శ్రేణులుగా విభజించి నాణ్యమైన ఫలితాలను అందించిన 39 మంది కార్మికులను తిరుమల జెఈవో ప్రశంసించారు. వీరిలో 23 మంది తిరుమల కల్యాణకట్టలో పనిచేసే కార్మికులు కాగా, 16 మంది తిరుపతిలోని తలనీలాల గోడౌన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తలనీలాల వేలంలో తితిదే ఆదాయం పెంచేందుకు విశేషకృషి చేసిన కార్మికులను ఈ సందర్భంగా జెఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో తలనీలాల గోడౌన్‌, ఆక్షన్‌ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.