TIRUMALA JEO INSPECTS BTU ARRANGEMENTS AT FOUR MADA STREETS_ తిరుమలలోని నాలుగు మాడ వీధులలో తణిఖీలు నిర్వహించిన తిరుమల జె.ఇ.ఓ

Tirumala, 17 September 2017: With just five days left for the commencement of the holy and prestigious Brahmotsavam-2017, the Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the arrangements around the four mada streets the venue of unique Vahana sevas.

Accompanied by the CVSO Sri Ake Ravi Krishna and Urban SP Sri Abhisekh Mohanty, he inspected the arrangements for toilets, seating, lighting and security in the huge galleries of the Mada streets besides the exit and entry routes and gates. He also reviewed and inspected the key entry point near Rambagicha Rest house and also the foot over bridge newly constructed from the Sapthagiri rest house towards the Srivari Temple.

Speaking to newsmen later Sri Raju said that both the police and drawing from the experiences of the last Brahmotsavam-2016 the TTD vigilance and the police have laid down strategic crowd management plans for nine-day holy event of Brahmotsavam. All the effort and arrangements are aimed to provide a hassle free and comfortable experience to devotees who come in large number for witnessing the vahana sevas.

Among others SE Sri Ramachandra Reddy and VGO Sri Ravindra Reddy and other officials participated in the inspection.


ISSUED BY PUBLIC RELATIONSOFFICER, TTDs, TIRUPATI

తిరుమలలోని నాలుగు మాడ వీధులలో తణిఖీలు నిర్వహించిన తిరుమల జె.ఇ.ఓ

సెప్టెంబర్‌ 17, తిరుమల 2017: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలకు సరిగ్గా ఐదురోజులే వుండడంతో తిరుమల నాలుగు మాడ వీధులలోను మరియు ఇతర ప్రాంతాలలోను జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారంనాడు సాయంత్రం తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌ శ్రీనివాసరాజు, సి.వి.ఎస్‌.ఓ శ్రీ ఆకె.రవికృష్ణ, తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి శ్రీ అభిషేక్‌ మహంతిలతో కలసి తనిఖీలు నిర్వహించారు.

దాదాపు 3 గంటలపాటు కొనసాగిన ఈ తనిఖీలలో జె.ఇ.ఓ ఇతర ఉన్నతాధికారులతో కలసి నాలుగుమాడ వీధులలోని ప్రవేశ-నిష్క్రమణ మార్గాలను క్షుణంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన రాంభగీచా వద్ద నున్న ప్రవేశ మార్గాన్ని కూడా పరిశీలించారు. అటు తరువాత తి.తి.దే నూతనంగా సప్తగిరి సత్రాల నుండి ఆస్థానమండపం వరకు నిర్మిస్తున్న ‘పుట్‌ ఓవర్‌ బ్రిడ్జి’ని కూడా పరిశీలించారు.

అనంతరం ఆయన మీడితో మాట్లాడుతూ గత బ్రహ్మూెత్సవాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి బ్రహ్మూెత్సవాలలో తి.తి.దే విజిలెన్స్‌ సిబ్బంది మరియు పోలీస్‌ సమన్వయంతో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలు తిలకించడానికి ఏర్పాటు చేయడమే తమ ముఖ్య లక్ష్యమని ఆయన అన్నారు.

ఈ తణిఖీలో జె.ఇ.ఓతో పాటు ఎస్‌.ఇ2 శ్రీ రామచంద్రారెడ్డి, వి.జి.ఓ శ్రీ రవీంద్రారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.