TIRUMALA JEO INSPECTS QUEUE LINES _ క్యూలైన్లను పరిశీలించిన తిరుమల జె.ఇ.ఓ
క్యూలైన్లను పరిశీలించిన తిరుమల జె.ఇ.ఓ
తిరుమల, 07 జూలై 2013: తిరుమలలో అనూహ్యస్థాయిలో పెరిగిన వారంతపు రద్దీ దృష్ట్యా తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు వివిధ విభాగాధిపతులను వెంటపెట్టుకొని తిరుమలలోని వివిధ మార్గాల క్యూలైన్లలో కలియతిరిగారు. ఎప్పటికప్పుడు భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద వితరణ, త్రాగునీటి పంపిణీ తీరును మ్యాన్ప్యాక్ ద్వారా వాకబుచేసి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. మరో ప్రక్క భక్తులకు వివిధ దర్శనాలకు సంబంధించిన భక్తులకు దర్శన సమయాన్ని గురించి మైక్సెట్ద్వారా నిరంతరాయంగా ప్రకటనలు చేస్తూ, భక్తులకు తెలిసేలా చర్యలు చేపట్టారు.
ఈ ఏర్పాట్ల తనిఖీలో తిరుమల జె.ఇ.ఓతో పాటు తిరుమల ఆలయ డిప్యూటీ ఇఓ శ్రీ చిన్నంగారి రమణ, ఎ.వి.ఎస్.ఓ.లు శ్రీ మల్లిఖార్జునరావు, శ్రీ కోటేశ్వరరావులు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.