TIRUMALA JEO REVIEWS SRIVARI SEVA SADAN WORKS_ శ్రీవారి సేవా సదన్‌ నిర్మాణపనులపై జెఈవో సమీక్ష

Tirupati, Feb.9: The Tirumala JEO Sri KS Sreenivasa Raju today reviewed the construction works of the Srivari Seva sadan coming up at Tirumala.

During the review at TTD Admin buildings, the EE-1 Sri Prasad gave a 3-D presentation of the Complex model in which the JEO suggested creation of RO drinking water plant, Solar heaters, green landscape gardens around the complex, CCTV ,LED screens for Srivari Sevakulu training purposes ,speakers and Anna prasadam distribution hall etc.

The JEO directed PRO and HoD of the Srivari Sevaks Dr T Ravi to prepare an action plan to utilize services of 2000 sevakulu every month. He instructed the senior officials to inspect the complex completely and submit a report by February 19.

FACAO Sri Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy, SE-2 Sri Ramachandra Reddy, SE (Electricals) Sri Venkateswarlu, IT chief Sri Sesha Reddy, VSO Sri Raveendra Reddy, DE (Electricals) Smt Saraswati, EDP (OSD) Sri Balaji Prasad, Garden Dept Director Sri Srinivas participated in the review meeting.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి సేవా సదన్‌ నిర్మాణపనులపై జెఈవో సమీక్ష

ఫిబ్రవరి 09, తిరుమల, 2018: తిరుమలలో నిర్మాణంలో ఉన్న శ్రీవారి సేవాసదన్‌ పనుల పురోగతిపై జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఐటి కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో విభాగాల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా ఇఇ-1 శ్రీ ప్రసాద్‌ 3డిలో రూపొందించిన భవనం నమూనాను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఇందులో పలు మార్పులను జెఈవో సూచించారు. నూతన భవనంలో ఆర్‌వో తాగునీటి ప్లాంట్లు, సోలార్‌ హీటర్లు, భవనం చుట్టూ ఆహ్లాదంగా ఉద్యానవనం, సిసిటివిలు, సేవకుల శిక్షణ కోసం ఎల్‌ఇడి స్క్రీన్లు, స్పీకర్లు, అన్నప్రసాద వితరణశాల తదితర వసతులు కల్పించాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఒక రోజుకు సుశిక్షితులైన 2 వేల మంది శ్రీవారి సేవకులను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని పిఆర్‌వో డా|| టి.రవిని ఆదేశించారు. సీనియర్‌ అధికారుల బృందం ఈ భవనాన్ని కూలంకషంగా పరిశీలించి ఫిబ్రవరి 19న జరిగే సమావేశంలో నివేదించాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, డిఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీమతి సరస్వతి, ఇడిపి ఓఎస్‌డి శ్రీ బాలాజిప్రసాద్‌, ఉద్యానవన విభాగం అధీక్షకులు శ్రీ శ్రీనివాస్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.