TIRUMALA PONTIFFS CHATURMASA DIKSHA COMMENCES _ తిరుమలలో శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం

Tirumala,03 July 2023: Tirumala Senior Pontiff Sri Sri Sri Pedda Jeeyarswami along with his deputy commenced Chaturmasa Diksha at Tirumala on Monday.

A holistic procession from Sri Pedda Jeeyar mutt near Bedi Anjaneya temple commenced accompanied by Sri Chinna Jeeyarswami and other disciples. Following the temple tradition, they first paved visits to Swamy Pushkarini and Varaha Swamy temples before offering prayers in the Srivari temple.

At the main entrance in Sri Venkateswara temple, they were welcomed in a traditional manner and received by TTD EO Sri AV Dharma Reddy.

After darshan, the senior pontiff presented Melchat Vastram and the junior pontiff with Noolchat Vastram. Later in Pedda Jeeyar Mutt, the pontiff felicitated Tirumala temple DyEO Sri Lokanatham, VGO Sri Bal Reddy, and Peishkar Sri Srihari on the auspicious occasion.

The legend says that as per Sanatana Hindu tradition, this Diksha is very significant. During the Chaturmasa Diksha (Shravana, Bhadrapada, Ashwayuja, and Karthika Masams) the pontiffs will perform japa, Homa seeking the well-being of humanity.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం

 తిరుమల, 2023 జులై 03 ; తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం ప్రారంభమైంది.

అంతకుముందు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ పూజ‌, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. త‌రువాత సేక‌రించిన పుట్టమ‌న్నుకు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి చాతుర్మాస సంక‌ల్పం స్వీక‌రించారు. అనంత‌రం ‌‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయ‌ర్ స్వామి మరియు ఇతర శిష్యబృందంతో శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.

శ్రీవారి ఆలయ మహ‌ద్వారం వ‌ద్ద టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీ చిన్నజీయంగారికి నూలుచాట్‌ వస్త్రాన్ని బహూకరించారు.

అనంతరం శ్రీపెద్దజీయర్‌ మఠంలో శ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ చిన్నజీయర్‌స్వామి కలిసి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజిఓ శ్రీ బాల్ రెడ్డి, పేష్కర్ శ్రీ శ్రీహరిలను శాలువతో సన్మానించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.