TIRUMALA SHINES IN THE BRIGHTNESS OF KARTHIKA DEEPOTSAVAM_ శ్రీవారి ఆలయంలో కన్నుల పండుగగా కార్తీక దీపోత్సవం

Tirumala, 3 December 2017: The hill temple of Tirumala sparkled in the twilight of ghee lit lamps on Sunday evening on the auspicious day of Karthika Parva Deepotsavam which was observed in the temple with religious fervour.

The celestial annual fete was observed in the evening between 6pm and 8pm. The entire premises of temple illuminated in the brightness of hundreds of ghee lit lamps.

Later TTD EO Sri Anil Kumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri A Ravikrishna and other officials carried huge ghee lamps in “Mookullu”, special mud pots and lit the lamps in all the sub-temples inside the temple and also across the four mada streets and finally at Bedi Anjaneya Swamy temple.

HH Sri Pedda Jiyangar Swamy, Temple DyEO Sri Rama Rao, Peishkar Sri Ramesh, Parpathyedar Sri Ramachandra also graced the occasion.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

శ్రీవారి ఆలయంలో కన్నుల పండుగగా కార్తీక దీపోత్సవం

తిరుమల 03 డిసెంబరు, 2017: తిరుమల శ్రీవారి అలయంలో ఆదివారంనాడు కార్తీక పౌర్ణమి దీపోత్సవం టిటిడి ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం విశేషంగా కన్నుల పండుగగా జరిగింది.

కాగా సాయంత్రం 5.00 గంటల నుండి 8.00 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో భాగంగా మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర 100 కొత్త మూకుళ్ళలో నేతి వత్తులతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు. ఆతర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభఅర, తాళ్లపాకంఅర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనంఅర, పరిమళంఅర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి సుమారుగా 100 నేతిజ్యోతులను మంగళవాయిద్య పురస్సరంగా వేదమంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు. ఈ కార్తీక దీపోత్సవం వెలుగుల దేదీప్యంమానంతో భక్తుల హృదయాలలో జ్ఞానజ్యోతులు వెలిగాయి.

పౌర్ణమినాడు వినీలాకాశంలో చంద్రబింబం వెలుతురు నడుమ భువిపై వెలిగిన కార్తీకదీపాల వెలుగుల కాంతులలో తిరుమల శ్రీవారి ఆలయం నూతన శోభను సంతరించుకొంది.

ఈ కార్తీకదీపోత్సవంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌ శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామరావు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.