TIRUMALA TEMPLE HAS A WELL-ORGANIZED PILGRIM MANAGEMENT SYSTEM- DEVOTEES _ ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు తిరుమ‌ల‌లో వ‌స‌తి

PILGRIM-FRIENDLY SERVICES ARE OUR PRIME MOTTO-TTD EO

 

PRASADAMS ARE PREPARED AS PER ‘DITTAM’

 

TIRUMALA, 10 SEPTEMBER 2022: The Hill Shrine of Sri Venkateswara Swamy at Tirumala is the only temple in India that has a well-organised system of pilgrim management that no other temple in the country has lauded pilgrim devotees.

 

This compliment came from the pilgrim callers during the live phone-in programme, Dial your EO held at Annamaiah Bhavan in Tirumala on Saturday. Callers Sri Sridhar, Sri Ashok, Smt Kanakadurga, Sri Rajesh while appreciating the impeccable pilgrim-friendly services of TTD with the EO Sri AV Dharma Reddy also brought a few suggestions to improve the existing system to the notice of the TTD Administrative Chief.

 

In total, 30 pilgrim callers had given the TTD EO valuable suggestions. Some excerpts from the hour-long live phone-in programme.

 

When a caller Sri Dasaratha Ramaiah from Guntur informed EO that the usage of sugar in “Laddu” prasadam is more and shall be reduced. Reacting to the caller, the EO answered, all the Prasadams and Naivedyams are prepared as per “Dittam”-a specific formula to prepare prasadams on what quantities of ingredients to be used for making prasadams. “Sri Vaishnava Brahmins alone prepare Laddu Prasadams every day to the tune of 5-6lakhs. However we will pursue the suggestion”, he maintained.

 

A pilgrim caller from Hyderabad Sri Subramanyam complimented the TTD for live telecasting “Yoga Darshanam” on SVBC to which the EO responded, “This programme will last for another three months and Garuda Puranam will commence later that will last for another ten months”, he added.

 

Sri Jayaram from Kadiri asked EO to telecast Akhanda Bhajana programme also on SVBC to which the EO said, all the time-slots for each programme are fixed in SVBC. However, he said, they will try to accommodate a slot for the recorded Akhanda Bhajana programmes also on the TTD-run spiritual channel.

 

When caller Sri Satyanarayana from Rajamundry said that he is a handicapped and coming for darshan on September 28, during annual Brahmotsavams, the EO requested him to postpone his Tirumala visit after the annual fete as TTD has cancelled all privilege darshans during the nine days since it is anticipating heavy surge of pilgrim crowd this year.

 

Smt Varalakshmi from Proddutur appreciated the services of temple authorities in Tiruchanoor to which the EO thanked her for the positive feedback on the improvements.

 

A caller Sri Srihari suggested EO to avoid sending pilgrims from the Right side of Dhwajasthambham for darshan as it becomes Apradakshina while having Darshan of Sri Venkateswara. Thanking the caller for his valuable suggestion, the EO said, TTD is forced to send devotees from both Right and Left sides of Dhwajasthambham for Srivari Darshan when there is a huge surge in the pilgrim crowd, only to avoid them long waiting hours. However, he said, his suggestion is well taken.

 

When Sri Marimuttu from Erode of Tamilnadu brought to the notice of EO that both the Rs.300 and free Darshan lines are merged, the EO said Rs.300 Special Entry Darshan ticket holders will be sent to Darshan through VQC 1 while free darshan pilgrims through VQC2. However, during rush days, we need to balance both Darshan categories, he observed.

 

Another pilgrim Sri Ashok and Sri Ravikumar from Tirupati brought to the notice of EO the harsh behaviour of staff with pilgrims, to which the EO responded TTD has been giving training to its employees on behavioural training at SVETA Bhavan regularly. However he will verify and take appropriate action against them.

 

 When Sri Nagarajan from Nagari brought to the notice of EO about a valuable land of TTD lying near Tiruttani and expressed fear of encroachment, the EO said, he personally visited the site a couple of times and fencing was already laid by TTD to avoid encroachments and said a Kalyana Mandapam will be constructed soon in the vacant site.

 

Another caller Sri Narasinga Rao from Vijayanagaram brought to the notice of EO on lack of cleanliness near Rambhageecha and PAC areas, the EO said, ever since April, TTD has been witnessing heavy rush till the day and each accommodation is being allotted even twice on a few days without time gap for taking up cleaning. However he assured that necessary measures will be taken to maintain cleanliness.

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CVSO SVBC Sri Shanmukha Kumar, CE Sri Nageswara Rao were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు తిరుమ‌ల‌లో వ‌స‌తి

– తిరుప‌తిలోనే వ‌స‌తి పొందాల‌ని భ‌క్తుల‌కు సూచ‌న‌

– డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2022 సెప్టెంబ‌రు 10: తిరుమ‌ల‌లో 7 వేల గ‌దులు మాత్ర‌మే ఉన్నాయ‌ని, ఇందులో దాదాపు 25 వేల మందికి మాత్ర‌మే వ‌స‌తి క‌ల్పించే అవ‌కాశం ఉంద‌ని, కావున భ‌క్తులు తిరుప‌తిలోనే వ‌స‌తి పొందాల‌ని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సూచించారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1.నర్సింగారావు – విశాఖపట్నం, శ్రీహరి – పలమనేరు

ప్రశ్న- తిరుమలలో వసతి గదులు దొరక్క ఇబ్బంది పడుతున్నాం. ఆన్‌లైన్‌లో కూడా వ‌స‌తి గ‌దులు దొర‌క‌డం లేదు. పిఎసిలో మ‌రుగుదొడ్ల‌లో పారిశుధ్య నిర్వహణ బాగాలేదు?

ఈవో – తిరుమలలో వ‌స‌తి గ‌దులు ప‌రిమిత సంఖ్య‌లో ఉన్నందున భ‌క్తులంద‌రికి వ‌స‌తి క‌ల్పించ‌డం వీలు లేదు. ఆన్‌లైన్‌లో 50 శాతం గ‌దులు ఉంచ‌డ‌మైన‌ది. అధిక రద్దీ కారణంగా గదులు రోజుకు రెండు మూడు సార్లు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా పారిశుధ్య నిర్వహణకు అద‌న‌పు సిబ్బంది ఏర్పాటుకు చర్యలు చేపడతాం.

2.రవికుమార్ – తిరుపతి

ప్రశ్న- తిరుపతి టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉన్న ఉద్యోగుల లడ్డూ కౌంటర్ నందు లడ్డూ కవర్ తీసుకున్నాక చిల్లర ఇవ్వడం లేదు?

ఈవో – పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

3.మారిముత్తు – తమిళనాడు

ప్రశ్న- గత మూడు నాలుగు నెలలుగా ద‌ర్శ‌నం క్యూలైన్లు అధిక దూరం ఉంటున్నాయి. ప్రత్యేక దర్శనం టికెట్లు తీసుకున్న ఎక్కువ సమయం ద‌ర్శ‌నానికి వేచి ఉండాల్సి వస్తుంది. క్యూ లైన్ల‌లో తోపులాట ఎక్కువ‌గా ఉంది?

ఈవో – ఈ ఏడాది ఏప్రిల్ నుండి అధిక సంఖ్య‌లో భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌స్తున్నారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు విక్యూసి-1 ద్వారా, సర్వదర్శనం భక్తులు క్యూ లైన్ల‌లో వేచి ఉండి విక్యూసి- 2 ద్వారా ఆల‌యంలోకి ప్రవేశిస్తారు. కావున అధిక స‌మ‌యం బ‌య‌ట ఉన్న భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించ‌డానికి విక్యూసి-1 చివ‌ర రెండు లైన్లు క‌లుస్తాయి.

4.శ్రీహరి- హైదరాబాద్

ప్రశ్న- ఆలయంలో రద్దీ అధికంగా ఉన్నప్పుడు ధ్వజస్తంభం కుడివైపు నుండి ఆలయంలోకి పంపిస్తున్నారు. దీని వలన అప్రదక్షిణగా వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి వస్తుంది. కావున ఎడమవైపు నుండి పంపేలా చర్యలు తీసుకోండి?

ఈవో – ఎడమ వైపు నుండి పంపేలా చర్యలు తీసుకుంటాం.

5.వీరన్న – ఆదోని

ప్రశ్న- తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భ‌వ‌నంలో భోజనం వడ్డించే విధానంలో మార్పు చేయాలి. అన్నం వృధా కాకుండా చూడాలి?

తిరుమలలోని ఉచిత బస్సుల్లో కెపాసిటీకి మించి భక్తులను ఎక్కిస్తున్నారు?

శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం వద్ద టికెట్లు ఇవ్వడానికి అధిక సమయం తీసుకుంటున్నారు?

ఈవో – తిరుమలలో రోజుకి లక్ష మందికి పైగా భ‌క్తుల‌కు భోజనాలు అందిస్తున్నాము. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భ‌వ‌నం, విక్యూసి, తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నాము.

ఉచిత బస్సుల్లో కెపాసిటీకి మించి భక్తుల్ని ఎక్కించుకోకుండా చర్యలు తీసుకుంటాం.

శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం టీటీడీ పరిధిలో లేదు. ఆల‌యం హ‌థీరాంజీ మ‌ఠం ఆధీనంలో ఉంది. దేవాదాయ శాఖకు తెలియపరుస్తాం.

6.అశోక్ – తిరుపతి

ప్రశ్న- టీటీడీ ట్రస్టుకు రూ.10 లక్షల రూపాయలు విరాళంగా అందించాము. ఆలయంలో దాత‌ల‌ను నెట్టివేస్తున్నారు?

ఈవో – దాత‌ల‌కు బ్రేక్ ద‌ర్శ‌నం ఇచ్చి కులశేఖర ప‌డి నుండి స్వామివారి దర్శనం కల్పిస్తున్నాము. సిసి టివి ఫుటెజ్ చూసి చ‌ర్య‌లు తీసుకుంటాం.

7.నాగరాజు – నగిరి

ప్రశ్న- తిరుత్త‌ణిలో టీటీడీ కళ్యాణ మండపం ఉండేది. ప్రస్తుతం అక్కడ కళ్యాణ మండపం లేదు. ఆ స్థలాన్ని చుట్టు పక్కల వారు ఆక్రమిస్తున్నారు?

ఈవో – త్వ‌ర‌లో కళ్యాణ మండపం కట్టడానికి ప్రయత్నిస్తాం.

8.కనకదుర్గమ్మ – ఖమ్మం, సుబ్ర‌మ‌ణ్యం – హైద‌రాబాద్‌

ప్రశ్న- శ్రీ వెంకటేశ్వర భక్తి ఛాన‌ల్‌లో ప్ర‌సారం అవుతున్న యోగ ద‌ర్శిని కార్యక్రమం చాల బాగుంది. కానీ ఆడియో బాగాలేదు?

ఈవో – ధ‌న్య‌వాదాలు. త్వ‌ర‌లో గ‌రుడ పురాణం ప్ర‌సారం ప్రారంభిస్తాం. ఇటీవల దాతల సహాకారంతో దాదాపు రూ.9 కోట్లతో ఎస్వీబిసిలో అత్య‌ధునిక ప‌రిక‌రాల‌తో ఆధునీకరించాం. ఆడియో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం.

9.దశరధ రామయ్య – గుంటూరు

ప్రశ్న- శ్రీ‌వారి లడ్డూ ప్రసాదంలో చక్కెర ఎక్కువగా ఉంటోంది?

ఈవో – తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు మాత్రమే తయారు చేస్తారు. దానికి దిట్టం ఉంటుంది, దాని ప్రకారమే తయారు చేస్తారు.

10.వెంకటేష్ – బెంగళూరు

ప్రశ్న- జిఎన్‌సి వద్ద అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు ఉంటున్నారు. అన్య‌మత ప్ర‌చారం చేస్తున్నట్లుగా ఉంది

ఈవో – తిరుమలలో రెండు వేల సిసి కెమెరాలు ఉన్నాయి. ప‌టిష్టమైన నిఘా, భద్రత వ్యవస్థ ఉంది. అలాంటి అవ‌కాశం లేదు. జిఎన్‌సి వద్ద అదనపు భద్రత సిబ్బందిని ఏర్పాటు చేస్తాం.

11.జయరాం- కదిరి

ప్రశ్న- తిరుమ‌ల‌లో అఖండ భజన కార్యక్రమాన్ని ఎస్వీబిసిలో ప్రత్యక్ష ప్రసారం చేయాలి?

ఈవో – ఎస్వీబిసి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నాము. అఖండ భ‌జ‌న కార్య‌క్ర‌మాన్ని రికార్డ్ చేసి ఎస్వీబిసిలో ప్రసారం చేస్తాం.

12.సత్యనారాయణ – రాజమండ్రి

ప్రశ్న- నేను వికలాంగుడిని, బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి దర్శనం క‌ల్పించండి?

ఈవో – సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలు దృష్ట్యా అన్ని ర‌కాల ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేశాము. కావున బ్ర‌హ్మోత్స‌వాల త‌రువాత తిరుమలకు వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోండి.

13.సారంగపాణి – వరంగల్, కుమార్ – ఖమ్మం

ప్రశ్న- శ్రీవారి సేవ కేటాయించడానికి డబ్బులు అడుగుతున్నారు?

ఈవో – శ్రీవారి సేవకులు స్వచ్ఛంద సేవ చేయడానికి తిరుమలకు వస్తున్నారు. కావున ఎవరికీ డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి. అలా ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటాం.

14.సతీష్ – హైదరాబాద్

ప్రశ్న- తిరుమ‌ల కళ్యాణ వేదికలో మా సోదరి వివాహం చేయాలనుకున్నాం. కానీ పెళ్లి కాన‌ట్లు సర్టిఫికెట్ అడుగుతున్నారు. తెలంగాణలో ఈ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు?

ఈవో – సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యాసాధ్య‌ల‌ను ప‌రిశీలిస్తాం.

15.సంతోష్ – హైదరాబాద్ శ్రీ‌హ‌రి – ప‌ల‌మ‌నేరు

ప్రశ్న- ఆన్‌లైన్‌లో ల‌క్కి డిప్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల‌కు డబ్బు చెల్లించే స‌మ‌యంలో ట్రాన్స్‌ఫ‌ర్ కాలేదు?

ప్రశ్న- ఆలయ అధికారులు మీ సమస్యను పరిష్కరిస్తారు.

17.వినయ్ – వరంగల్

ప్రశ్న- యాదాద్రి లో అభివృద్ధి చేసినట్లు తిరుమలలో కూడా చేయండి?

ఈవో – ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తిరుమలలో విశేష సౌకర్యాలు టీటీడీ కల్పిస్తొంది. తిరుమలలో లేనివి యాదాద్రిలో ఉన్నవి ఉంటే పరిశీలిస్తాం.

18.శ్రీకాంత్ – మంచిర్యాల

ప్రశ్న- టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ అందించే విగ్రహాలకు డిడి కట్టాం. ఇంతవరకు విగ్రహాలు ఇవ్వలేదు. సప్తగిరి మాసపత్రిక అందడం లేదు. మాకు బ్రహ్మోత్సవ దర్శనం కల్పించండి?

ఈవో – అధికారులు మీతో మాట్లాడి విగ్రహాలు అందిస్తారు. సప్తగిరి మాసపత్రిక మీకు అందేలా చర్యలు తీసుకుంటాం. బ్రహ్మోత్సవాల్లో సర్వదర్శనం మాత్రమే ఉంటుంది.

19.శ్రీలక్ష్మీ – ఏలూరు

ప్రశ్న- తిరుమలలో టీటీడీ సేవలు బాగున్నాయి. గరుడసేవ నాడు మాకు దర్శ‌నం అవుతుందా?

ఈవో – గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి. ఈ సంవత్సరం ఆల‌య నాలుగు మాడ వీధుల్లో జ‌రుగుతున్నందున‌ అధిక రద్దీ ఉంటుంది. కావున స‌ర్వ‌ద‌ర్శ‌నంలో స్వామివారిని దర్శించుకోండి.

20.దినేష్- విజయవాడ

ప్రశ్న- ఆన్‌లైన్ లక్కిడిప్‌లో ఆధార్ కార్డు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోండి?

ఈవో – ఈ విషయం పరిశీలిస్తున్నాము.

21.శ్రీనివాస్ -నెల్లూరు

ప్రశ్న- గత ఏడాది వర్చువల్ కళ్యాణోత్సవం టికెట్‌ను ఆన్‌లైన్‌లో తీసుకున్నాము. సంవత్సరంలోపు దర్శనం చేసుకోవచ్చన్నారు, మాకు దర్శనం కల్పించండి?

ఈవో – మీకు దర్శనం కల్పిస్తాం.

22.రాజేష్ – నిజామాబాద్

ప్రశ్న- లడ్డు కౌంటర్ వద్ద డబ్బులు తీసుకుని అధిక లడ్డూలు ఇస్తున్నారు. తిరుమ‌ల‌లో టీటీడీ సిబ్బంది ప్ర‌తి దానికి డ‌బ్బులు అడుగుతున్నారు. గ‌ది ఖాళీ చేసేట‌ప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది భక్తుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తగు చర్యలు తీసుకోగలరు ?

ఈవో – తిరుమ‌ల‌లో విజిలెన్స్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. టీటీడీ ఉద్యోగులకు శ్వేత‌లో ప్రత్యేకంగా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము.

23.బల్వంతరావు – ఒరిస్సా, శ్రీహరి – చెన్నై

ప్రశ్న- టీటీడీ సేవ‌లు చాలా బాగున్నాయి. సీనియర్ సిటిజ‌న్స్‌ నడవలేము, కావున మాకు సులభ దర్శనం కల్పించండి?

ఈవో- ఆన్‌లైన్‌లో ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క‌లిగిన నడవలేని వృద్ధులకు బయోమెట్రిక్ ద్వారా దర్శనం కల్పిస్తున్నాం.

24.బాబ్జీ- చేబ్రోలు

ప్రశ్న- క్యూలైన్లో అన్నప్రసాదాలు ఇవ్వడం లేదు?

ఈవో – క్యూలైన్‌ల‌లో నిరంత‌రం తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు నిరంతరం అందిస్తున్నాం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.