TIRUMALA TO LEAD THE SPIRITUAL MOVEMENT -TTD TRUST BOARD CHIEF _ ఆధ్యాత్మిక భావ‌వ్యాప్తి కోసమే ధార్మిక స‌ద‌స్సు- ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి

TIRUMALA, 31 JANUARY 2024: The World renowned Hindu Religious Institute of Tirumala Tirupati Devasthanams is organising a three-day Sanatana Dharmika Sadas from Feburary 3 to 5 inviting various Peethadhipathis(Pontiffs)across the country and all set to lead a “Spiritual Movement”, sustaining the values of Hindu Sanatana Dharma for the future generations, asserted TTD Trust Board Chairman Sri Bhumana Karunakara Reddy.

After personally inspecting the ongoing arrangements for the Dharmika Sadas at Astana Mandapam in Tirumala on Wednesday along with the TTD JEO for Health and Education Smt Sada Bhargavi and other officials, speaking to media persons he said, TTD has been organizing wide range of spiritual programmes under the auspices of its Hindu Dharma Prachara Parishad(HDPP) preventing religious conversions in remote and backward areas. With a noble aim to take forward the values embedded in the great epics, heritage, culture and religious texts of Hindu Dharma to reach the public especially the younger generation of today across the nation, TTD has mulled this three day Dharmika Sadas where in so far 57 Peethadhipathis have given their consent to take part. “We welcome the suggestions by the Pontiffs and Seers and implement their suggestions in carrying out more Dharmik programmes in a comprehensive manner”, he maintained.

The Chairman further said, that TTD, in the past, has also organised unique charitable programs like Dalit Govindam, Kalyanamastu, Kaisika Dwadasi and many more which helped in preventing religious conversions in the remote areas.  Expressing his confidence that this Dharmika Sadas programme will help enhancing the ethical and spiritual values among the citizens and especially youth he said, “For the last several decades, Tirumala has been the epitome of spiritual capital in the entire country and again today the pilgrim centre has geared up to lead yet another Spiritual Movement across the country with the valuable suggestions by the great pontiffs and seers in the ensuing Dharmika Sadas, for further strengthening our Sanatana Dharma”, he asserted. 

CEO SVBC Sri Shanmukh Kumar, SVVU VC Sri Rani Sadasivamurty, CE Sri Nageswara Rao, CPRO Dr T Ravi, SE 2 Sri Jagadeeshwar Reddy, HDPP Secretary Sri Somayajulu, All Dharmic Projects Programme Officer Sri Rajagopal, Special Officer of Dasa Sahitya Project Sri Ananda Theerthacharyulu, Health Office Dr Sridevi, Civil Surgeon Aswini Hospital Dr Kusuma Kumari, Garden Deputy Director Sri Srinivasulu, VGO Sri Nanda Kishore and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఆధ్యాత్మిక భావ‌వ్యాప్తి కోసమే ధార్మిక స‌ద‌స్సు

– ఫిబ్ర‌వ‌రి 3 నుండి 5వ తేదీ వ‌ర‌కు

– దేశం న‌లుమూల‌ల నుండి 57 మంది పీఠాధిప‌తులు రాక‌

– ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి

తిరుమల, 2024 జనవరి 31: శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి అనుగ్ర‌హంతో భ‌క్తుల్లో ఆధ్యాత్మిక భావ‌వ్యాప్తి కోస‌మే తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో ఫిబ్ర‌వ‌రి 3 నుండి 5వ తేదీ వ‌ర‌కు ధార్మిక స‌ద‌స్సు నిర్వ‌హిస్తామ‌ని టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తెలిపారు. ధార్మిక స‌ద‌స్సు ఏర్పాట్ల‌ను బుధ‌వారం ఉద‌యం ఛైర్మ‌న్ ప‌రిశీలించారు.
 
ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో మ‌రింత‌గా హైంద‌వ ధ‌ర్మాన్ని, శ్రీ‌వారి వైభ‌వాన్ని వ్యాప్తి చేసేందుకు, మ‌తాంతీక‌ర‌ణ‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు, చిన్న‌వ‌య‌సు నుండే పిల్ల‌ల్లో మాన‌వ‌తా విలువ‌ల‌ను పెంచేందుకు టీటీడీ అనేక చ‌ర్య‌లు చేప‌డుతోంద‌న్నారు. ఇందులో భాగంగా ధార్మిక స‌ద‌స్సు నిర్వ‌హించి పీఠాధిప‌తులు, మ‌ఠాధిప‌తుల సూచ‌న‌లు స్వీక‌రించి మ‌రింత‌గా ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని వివ‌రించారు. ఇప్ప‌టివ‌ర‌కు 57 మంది పీఠాధిప‌తులు స‌ద‌స్సుకు విచ్చేసేందుకు స‌మ్మ‌తి తెలియ‌జేసిన‌ట్టు చెప్పారు.

శ్రీ‌వారి ఆల‌యం నుండి ఏ సందేశం వెళ్లినా భ‌క్తులంద‌రూ ఆమోదించి ఆచ‌రిస్తార‌ని ఛైర్మ‌న్ తెలిపారు. 16 సంవ‌త్స‌రాల క్రితం తాను ఛైర్మ‌న్‌గా ఉన్న‌పుడు ధార్మిక స‌ద‌స్సులు నిర్వ‌హించామ‌ని చెప్పారు. ఇందులో పీఠాధితులు చేసిన సూచ‌న‌ల మేర‌కే ద‌ళిత‌గోవిందం, క‌ల్యాణ‌మ‌స్తు, గిరిజ‌న గోవిందం, కైశిక‌ద్వాద‌శి లాంటి ధార్మిక కార్య‌క్ర‌మాలు విజ‌యవంతంగా నిర్వ‌హించామ‌ని తెలియ‌జేశారు.

ఛైర్మ‌న్ వెంట జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ ష‌ణ్ముఖ్ కుమార్‌, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, సిపిఆర్వో డా. టి.ర‌వి, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి, అశ్విని ఆసుపత్రి వైద్యాధికారి డా. కుసుమ కుమారి, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజ‌గోపాల్‌, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి శ్రీ సోమ‌యాజులు, దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద‌తీర్థాచార్యులు, ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, విజివో శ్రీ నందకిషోర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.