TIRUMANGAI ALWAR SATTUMORA IN SRI GT _ డిసెంబ‌రు 10న శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర‌

Tirupati, 9 Dec. 19: The Sattumora of Sri Tirumangai Alwar, the last among the twelve Alwars will be observed in Sri Govindaraja Swamy temple on Tuesday.

The utsava murthies of Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi will be taken on a celestial procession in the evening.

Meanwhile it is believed that it was Tirumangai Alwar who paved visit to all Sri Vaishnava Divya Desams located on Earth. He is also revered as Sarangi-the Bow of Lord.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

డిసెంబ‌రు 10న శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర‌

తిరుప‌తి, 09, డిసెంబ‌రు 2019: తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో డిసెంబ‌రు 10వ తేదీ మంగ‌ళ‌వారం శ్రీ తిరుమంగై ఆళ్వార్ సాత్తుమొర జ‌రుగ‌నుంది.

ఈ ఆల‌యంలో డిసెంబ‌రు 1 నుండి శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్స‌వం జ‌రుగుతోంది. సాత్తుమొర సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు, శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

ఆళ్వారుల పరంపరలో ఆఖరి వాడైన శ్రీ తిరుమంగై ఆళ్వార్‌ను శ్రీవారి ధనుస్సు అయిన సారంగి అంశ అంటారు. తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే భువిలో ఉన్న నూట ఆరు దివ్యదేశాలను సందర్శించార‌ని వారి శిష్యుల మాట‌. స్వామివారిని కీర్తిస్తూ వెయ్యికి పైగా పాశురాలను గానం చేసాడు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.