TIRUNAKSHATRA MARYADA HELD FOR TIRUMALA SENIOR PONTIFF _ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామికి తిరు నక్షత్ర మర్యాద

TIRUMALA, 17 DECEMBER 2024: On the occasion of the 75th Tirunakshatram (Birth Day) on the auspicious day of Punarvasu Nakshatram of HH Sri Periya Kovil Kelviyappan Satagopa Ramanuja Pedda Jeeyar Swamy of Tirumala, Tirunakshatra Maryada was held with the traditional temple honours on Tuesday.

Earlier, the Swamiji accompanied by his deputy HH Ilaya Kovil Kelviyappan Sri Govinda Ramanuja Chinna Jeeyangar Swamiji and other disciples entered the Mahadwaram of the temple.

As a part of Pedda Maryada, Isthikapal honours were given at Ragimanu and from there he reached Maha Dwaram along with his disciples.

The TTD Chairman Sri BR Naidu along with TTD EO Sri J Syamala Rao and Additional EO Sri Ch Venkaiah Chowdary, CVSO Sri Sreedhar welcomed the Tirumala Pontiff at the main entrance of the hill shrine.

The Senior Pontiff of Tirumala had darshan along with traditional honours inside sanctum sanctum.

Later, the Chairman, EO, Additional EO, CVSO accompanied the Pedda Jeeyar Swamy to Pedda Jeeyangar Mutt located adjacent to Sri Bedi Anjaneya Swamy temple.

Afterwards, the Pedda Jeeyar Swamy offered them his blessings.

TTD Trust Board member Sri Bhanuprakash Reddy, DyEO Sri Lokanatham, Peishkar Sri Ramakrishna and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామికి తిరు నక్షత్ర మర్యాద

తిరుపతి, 2024 డిసెంబరు 17: శ్రీ‌శ్రీ‌శ్రీ పెరియకోయిల్‌ కేల్వి అప్పన్‌ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి 75వ తిరు నక్షత్రం (జన్మదినం) సందర్భంగా మంగళవారం ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారి ఆలయంలో తిరు నక్షత్ర మర్యాద జరిగింది.

పెద్ద మర్యాదలో భాగంగా రాగిమాను వద్ద పెద్ద జీయర్ స్వామికి ఇస్తికఫాల్ స్వాగతం పలుకగా మేళ తాళాల మధ్య శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామితో కలిసి ఆలయం వద్దకు విచ్చేశారు.

టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ స్వామీజీకి మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న పెద్ద జీయర్ మఠానికి చేరుకున్నారు. ఇక్కడ పెద్ద జీయర్ స్వామీ టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, సీవీస్వోలకు ఆశీస్సులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.