TIRUPATI JEO LAUDS ENGINEERS ROLE IN NATIONAL DEVELOPMENT_ జాతి నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకం : టిటిడి తిరుపతి జెఈవో

Tirupati, 15 September 2017: TTD JEO Sri Pola Bhaskar today hailed the stellar role played by engineers in nation building activities in civil society.

He was speaking as Chief guest on the Engineers Day celebrations got up at SVETA Bhavan as part of the 157th Jayanti of Bharat Ratna Sir Mokshagundam Visvesvaraya, by the TTD engineers welfare association.

He said the self discipline and simplicity were the main virtues with which Sir Vishsweswaraiah could achieve wonders even in the days of low IT prevalence. He urged TTD engineers to take cue from his life story as Sir Mokshagundam Visvesvaraya had laid foundations for First Ghat Road, many reserviors in Tirumala and Tirupati besides many proejcts across the state and country.

TTD CVSO Sri Ake Ravikrishna said the engineering dept of TTD had become the backbone of various infrastructure generated for devotees benefit at Tirumala and Tirupati.

Both garlanded the statue of Sir M Vishswesaraiah at Padmavati Rest house circle and also felicitated Retired TTD engineers and other engineering staff with a shawl and Srivari portraints.

TTD Chief Engineer Sri Chandrasekhar Reddy presided on the event which was attended by staff of Engineering department and also other retiring seniors.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

జాతి నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకం : టిటిడి తిరుపతి జెఈవో

తిరుపతి, 15 సెప్టెంబరు 2017: నాగరికమైన జాతి నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకమైందని టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ ఉద్ఘాటించారు. భారతరత్న అవార్డు గ్రహీత, ప్రముఖ ఇంజినీరు సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 157వ జయంతిని పురస్కరించుకుని టిటిడి ఇంజినీర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇంజినీర్స్‌ డేని శుక్రవారం తిరుపతిలోని శ్వేత భవనంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో ప్రసంగిస్తూ సాంకేతిక పరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉన్న ఆనాటి పరిస్థితుల్లోనూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్‌లో అద్భుతాలు సృష్టించగలిగారని తెలిపారు. క్రమశిక్షణ, నిరాడంబరత దీనికి కారణాలన్నారు. టిటిడి ఇంజినీర్లు ఆయన లక్షణాలను అలవరుచుకుని వృత్తిపరంగా ఎదగాలని ఆకాంక్షించారు. తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డు, అనేక రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు దేశం, రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను శ్రీకారం చుట్టారని వెల్లడించారు. టిటిడిలోని ఇంజినీర్లు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఇంజినీరింగ్‌ పనుల్లో సంస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని కోరారు.

టిటిడి సివిఎస్వో శ్రీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని తెలిపారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇంజినీరింగ్‌ విభాగం టిటిడికి వెన్నెముకగా నిలుస్తున్నట్టు కొనియాడారు. ఇంజినీర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాలని ఆయన సూచించారు.

అనంతరం టిటిడిలో పదవివీరమణ చేసిన ఇంజినీరింగ్‌ అధికారులను, సిబ్బందిని జెఈవో, సివిఎస్వోలు శాలువ, శ్రీవారి చిత్రపటంతో సన్మానించారు.

అంతకుముందు శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం సర్కిల్‌ వద్దగల శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి టిటిడి తిరుపతి జెఈవో, సివిఎస్వోలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి ఇంజినీరింగ్‌ అధికారులు, విశ్రాంత ఇంజినీరింగ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది