TIRUPATI LEGISLATOR TAKES OATH AS TTD TRUST BOARD CHIEF _ టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షునిగా శ్రీ భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

TTD EO ADMINISTERS OATH

TIRUMALA, 10 AUGUST 2023: The Tirupati legislator Sri Bhumana Karunakar Reddy took oath as the 53rd Chairman of TTD Trust Board in Sri Venkateswara temple at Tirumala on Thursday.

He was administered oath in front of the presiding deity by TTD EO Sri AV Dharma Reddy.

Before reaching Tirumala, the Tirupati MLA offered prayers in the temple of folk Goddess Tataiahgunta Gangamma, who is considered as the sister of Lord Venkateswara. Later he reached Sapthagiri Gopradakshina Mandiram located near Alipiri and offered Gopuja. 

After reaching Tirumala, following the temple tradition he visited the Sri Bhu Varaha Swamy temple and later reached Tirumala temple through Vaikuntham Queue Complex.

He was received by TTD EO, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam and other officials at the main entrance of the temple. After taking oath inside the temple, he offered prayers along with the members of his family. Later at Ranganayakula Mandapam, he was rendered Vedasirvachanam by Vedic Pundits. He was presented with Theertha Prasadams, laminated photo of Srivaru by the TTD EO.

Among other dignitaries who were present includes, ministers Sri Ambati Rambabu, Smt RK Roja, Chandragiri MLA Sri Bhaskar Reddy, Chittoor legislator Sri Srinivasulu, ZP Chief Sri Srinivasulu and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షునిగా శ్రీ భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

తిరుమ‌ల‌, 2023 ఆగస్టు 10: టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షుడిగా శ్రీ భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణస్వీకారం చేశారు.

శ్రీవారి ఆలయంలో ని గరుడాళ్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తో ప్రమాణ స్వీకారం చేయించారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వచ్చిన శ్రీ భూమనకు మహాద్వారం వద్ద ఈవో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత శ్రీ వకుళామాత, శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, శ్రీభాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు . రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు.
అంతకు ముందు ఆయన తిరుపతిలోని శ్రీతాళ్లపాక గంగమ్మను దర్శించుకున్నారు. అలిపిరి లోని సప్త గోప్రదక్షిణ మందిరాన్ని దర్శించి గో పూజలో పాల్గొని పాదాల మండపంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవరాహ స్వామిని కూడా దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీమతి రోజా, శ్రీ అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు, జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.