TIRUVADIPUDI UTSAVAM OF ANDAL AMMAVARU_ జూలై 25 నుండి ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం

Tirupati, 19 Jul. 19: The Tiruvadipudi Utsavam of Andal Sri Godai in Sri Govindaraja Swamy temple will be observed from July 25 to August 3.

During these days, there will be Tirumanjanam of Ammavaru between 6 am to 6:30 am and procession in four mada streets between 5:30 pm to 6:30 pm.

Meanwhile on the last day there will be Snapana Tirumanjanam to Sri Govindaraja Swamy and Andal Ammavaru.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 25 నుండి ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం

తిరుపతి, 2019 జూలై 19: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 25 నుండి ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం 6 నుండి 6.30 గంటల వరకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

ఆగస్టు 1వ తేదీన ఆల‌యంలో శ్రీ చ‌క్ర‌త్తాళ్వార్ సాత్తుమొర‌, శ్రీ ప్ర‌తివాది భ‌యంక‌ర అన్న‌న్ సాత్తుమొర జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 3న ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్‌ క్వార్టర్స్‌, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌ఎస్‌ మాడ వీధి, చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.