TIRUVENKATANADHA GLIDES ON HOLY WATERS _ కన్నుల పండువగా శ్రీ మలయప్పస్వామివారి తెప్పోత్సవం
Tirumala, 8 Mar. 20: On the fourth day evening on Sunday, Sri Malayappa Swamy accompanied by His two Consorts Sridevi and Bhudevi glided smoothly on the sacred waters of Swamy Pushkarini.
The deities blessed the devotees on the finely decked float in five rounds.
Devotees thronged to the pushkarini to enjoy the celestial teppotsavam.
TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy and other officials were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
కన్నుల పండువగా శ్రీ మలయప్పస్వామివారి తెప్పోత్సవం
తిరుమల, 2020 మార్చి 08: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు ఆదివారంనాడు బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.

ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7.00 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదుమార్లు విహరించి భక్తులను కటాక్షించారు.
కాగా, చివరి రోజైన సోమవారం శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు ఏడుచుట్లు పుష్కరిణిలో తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.