TN GUV VISITS GO MANDIRAM _ అలిపిరి సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించిన తమిళనాడు గవర్నర్

TIRUPATI, 29 DECEMBER 2022: The first citizen of the state of Tamil Nadu, Sri Ravindra Narayanan Ravi visited Alipiri Go Mandiram on Thursday evening.

 

Donor of the Go Mandiram Sri Sekhar Reddy received the TN Governor.

Later he participated in the Puja of Sri Venugopala Swamy, Gopuja and offered Rs.6,600 for the fodder in Go Tulabharam.

 

He appreciated the idea of encouraging Gopuja by ttd by constructing a Go Pradakshina Mandiram.

 

SV Gosala Director Dr Harinath Reddy was also present.

 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అలిపిరి సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించిన తమిళనాడు గవర్నర్

తిరుపతి 29 డిసెంబరు 2022: తమిళనాడు గవర్నర్ శ్రీ రవీంద్ర నారాయణ రవి కుటుంబ సమేతంగా గురువారం సాయంత్రం అలిపిరి వద్ద గల టీటీడీ సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని దర్శించారు.

గో ప్రదక్షిణ మందిర నిర్మాణ దాత శ్రీ ఎ జె శేఖర్ ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు శ్రీ వేణుగోపాల స్వామికి పూజలు చేసిన అనంతరం గో ప్రదక్షిణ చేసి, గోపూజ నిర్వహించారు. అనంతరం గో తులాభారంలో పాల్గొని గోవుకు సమగ్ర దాణా అందించడానికి రూ 6600 గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డికి అందజేశారు . టీటీడీ ఆధ్వర్యంలో దాత ఎ జె శేఖర్ సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని నిర్మింప చేయడం అభినందనీయమని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకుపోవాలని గవర్నర్ అన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది