TRADITIONAL NEW UMBRELLA INSTALLATION FEST HELD _ నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

TIRUMALA, 30 JULY 2023: The annual festival of Chatrasthapanotsavam was observed with religious fervour in Tirumala on Sunday.

As per this unique fete, a new umbrella was installed on the highest peak at Tirumala in Narayanagiri Srivari Padalu amidst the chanting of Vedic hymns by Archaka Swamys and Veda Parayanamdars.

After Abhishekam to Srivari Padalu, a new umbrella was installed at this peak. Later Prasadam was distributed among devotees.

One of the chief priests of Tirumala temple Sri Govindaraja Deekshitulu, Archaka Sri Govindarajacharyulu, Sri Krishnachandra Deekshitulu, Parupattedar Sri Uma Maheswara Reddy were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

తిరుమల, 2023 జూలై 30: తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ఆదివారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు.

తిరుమల శ్రీవారి ఆలయం నుండి పూజా సామ‌గ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆల‌య మాడ వీధుల గుండా అర్చక బృందం మేదరమిట్టకు చేరుకున్నారు. అక్క‌డి నుండి నారాయ‌ణ‌గిరికి విచ్చేశారు. ముందుగా శ్రీ‌వారి పాదాల‌కు తిరుమంజ‌నం చేప‌ట్టారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. ఆ త‌రువాత‌ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించారు.

ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ ఎటి.గోవిందరాజ దీక్షితులు, అర్చకులు శ్రీ ఎ.గోవిందాచార్యులు, శ్రీ ఏఎస్.కృష్ణచంద్ర దీక్షితులు, పార్‌ప‌త్తేదార్ శ్రీ ఉమామ‌హేశ్వ‌ర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.