TRAIMASIKA METLOTSAVAM _ జూలై 10 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

TIRUPATI, 06 JULY 2023: Traimasika Metlotsavam will be observed between July 10-12 under the aegis of Dasa Sahitya Project of TTD in Govindaraja Chowltries in Tirupati.

 

Project Special Officer Sri Ananda Theerthacharya is supervising the arrangements.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
జూలై 10 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
 
తిరుపతి, 2023, జూలై 06: టీటీడీ ఆధ్వర్యంలో జూలై 10 నుండి 12వ తేదీ వరకు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల గోవిందరాజస్వామి సత్రాల్లో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనుంది.
 
ఈ మూడు రోజుల పాటు ఉదయం  భజన మండళ్లతో సుప్రభాతం, సామూహిక భజన కార్యక్రమాలు చేప‌డ‌తారు. సాయంత్రం సంగీత విభావరి, ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. జూలై 10న  సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం అధికార ప్రముఖులు సందేశం ఉంటుంది.జూలై 12వ తేదీ ఉదయం 4 గంటలకు అలిపిరి పాదాల మండపం వ‌ద్ద‌ మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండళ్ల సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.
 
గ‌తంలో ఎందరో మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని కాలిన‌డ‌క అధిరోహించి స్వామివారి అనుగ్రహం పొందారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో దాస సాహిత్య ప్రాజెక్టు మెట్లోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.