TRAIMASIKA METLOTSAVAM FROM JULY 4 TO 6 _ జూలై 4 నుండి 6వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

Tirupati, 25 Jun. 19:The tri-monthly fete, Traimasika Metlotsavam will be observed by Dasa Sahitya Project of TTD from July 4 to 6.

Nearly 3000 bhajan troupes from AP, TS, TN, Karnataka, take part in this Metlotavam with religious ecstasy.

As a part of this fete there will be shobha yatra, bhajans, metla puja, religious discourses in the three day programme .

Dasa Sahitya Project Special Officer Dr PR Anandatheerthacharyulu is supervising he arrangements.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 4 నుండి 6వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి, 2019 జూన్‌ 25 ; టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 4 నుండి 6వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరుగనుంది. మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టిటిడి శ్రీగోవిందరాజస్వామి మూడో సత్ర ప్రాంగణంలో ప్రారంభమవుతాయి.

జూలై 4, 5వ తేదీల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు భజన మండళ్ల సభ్యులు ఉదయం 5.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.జూలై 4న సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు అధికార ప్రముఖులు సందేశమిస్తారు. జూలై 6న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.

పూర్వకాలంలో మహర్షులు, రాజర్షులు, శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీక ష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని క పకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపడుతోంది. ఇలా కాలినడకన వెళ్లి సప్తగిరీశుని దర్శిస్తే వారికి సకల అరిష్టాలు తొలగిపోయి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.