TRAINING IN SELF EMPLOYMENT OPPS -CVSO_ప్రయివేటు సెక్యూరిటీగార్డుల కుటుంబ సభ్యులకు స్వయం ఉపాధి అవకాశాలు : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

Tirupati,24 February 2018: TTD CVSO Sri Ake Ravikrishna today indicated that family members of private security guards engaged in various tasks of TTD could utilise the self employment opportunities available in TTD.

He was addressing the self employment awareness cum training sessions held under the aegis of the NIRD and MEMPA at the SVETA bhavan for family members of the private security guards functioning at vigilance and security units of the TTD.

Participating as Chief Guest at the event Sri Ravi Krishna urged them to utilise the training camps held by NIRD and MEPMA for improving their skill sets and as well hike the family income levels by setting up some cottage industries.

NIRD director Mohammed Khan MEPMA project director Smt Jyoti and citi mission manager Sri Gopi explained the details of several skill development and self-employment courses -tailoring,jute bags,candle,paper bag making units and as well DTP ,Tally and other Computer courses .

Among others TTD VSOs Sri Ravindra Reddy, Smt Sadalakshmi, MEMPA official Sri Gopinath,AVSOs Sri Gangaraju,Sri Nandiswara Rao, Sri Chiranjeevulu and families of private security guards participated .


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ప్రయివేటు సెక్యూరిటీగార్డుల కుటుంబ సభ్యులకు స్వయం ఉపాధి అవకాశాలు : టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ

ఫిబ్రవరి 24, తిరుపతి, 2018 ; టిటిడి నిఘా, భద్రతా విభాగంలో విధులు నిర్వహిస్తున్న ప్రయివేటు సెక్యూరిటీగార్డుల కుటుంబ సభ్యులు స్వయం ఉపాధి కోర్సుల ద్వారా ఆదాయం పెంచుకోవాలని సివిఎస్‌వో శ్రీఆకె రవికృష్ణ సూచించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శనివారం నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(ఎన్‌ఐఆర్‌డి), పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ(మెప్మా) అధికారులు స్వయం ఉపాధి అవకాశాలపై ప్రయివేటు సెక్యూరిటీగార్డుల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిఎస్‌వో మాట్లాడుతూ కుటుంబ ఆదాయం పెరిగితే ప్రయివేటు సెక్యూరిటీగార్డులు మరింత మెరుగ్గా భక్తులకు సేవలు అందించగలుగుతారని తెలిపారు. మెప్మా, ఎన్‌ఐఆర్‌డి సంస్థలు అందిస్తున్న శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకుని కుటీర పరిశ్రమలను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎన్‌ఐఆర్‌డి డైరెక్టర్‌ శ్రీ మహ్మద్‌ ఖాన్‌, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీమతి జ్యోతి, సిటి మిషన్‌ మేనేజర్‌ శ్రీ గోపి స్వయం ఉపాధి కోర్సుల వివరాలను తెలియజేశారు. ఇందులో టైలరింగ్‌, జ్యూట్‌ బ్యాగులు, కొవ్వొత్తులు, పేపర్‌ బ్యాగుల తయారీ, కంప్యూటర్‌ సంబంధిత డిటిపి, ట్యాలీ తదితర కోర్సులు ఉన్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి, మెప్మా అధికారి శ్రీ గోపినాథ్‌, ఎవిఎస్‌వోలు శ్రీ గంగరాజు, శ్రీ నందీశ్వరరావు, శ్రీ చిరంజీవులు, ప్రయివేటు సెక్యూరిటీ గార్డుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.