TRAINING ON E-OFFICE_ ఈ‌-ఆఫీస్ విధానంపై జెఈవో సమీక్ష

Tirupati, 26 October 2017: A training program on e-office was held in SVETA Bhavan in Tirupati to HoDs, HoSs and clerical staff of TTD.

Addressing the meeting Tirupati JEO Sri P Bhaskar said, in first phase five departments, second phase ten departments were brought under e-office and by March next the filing system in TTDs is totally paper free, he added.

Later the EDP department staff explained the process of e-filing through power point presentation.

IT wing chief Sri Sesha Reddy was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఈ‌-ఆఫీస్ విధానంపై జెఈవో సమీక్ష

అక్టోబరు 26, తిరుపతి, 2017: టిటిడిలో మరింత సులభతరమైన, పారదర్శకమైన పాలన కోసం ఉద్దేశించిన ఈ‌-ఆఫీస్ విధానంపై తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ గురువారం తిరుపతిలోని శ్వేత భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మొదటి దశలో ఐదు కీలక విభాగాల్లో, రెండో దశలో 10 విభాగాల్లో ఈ-ఫైలింగ్‌ విధానాన్ని అమలుచేస్తున్నామని తెలిపారు. 2018, మార్చి 31వ తేదీ నాటికి అన్ని విభాగాలకూ వర్తింపజేస్తామని వివరించారు. అనంతరం టిటిడి ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఈ-ఫైలింగ్‌ విధానంలో ఫైళ్ల నిర్వహణ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

ముందుగా విభాగాధిపతులకు, ఏఇఓలతో జెఇఓ సమావేశం నిర్వహించారు. ఆ తరువాత కార్యాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.