Training programme for TTD Security Staff at SVETA Bhavan _ తితిదే భద్రతాసిబ్బందికి మూడురోజుల శిక్షణ

Tirupati, 24 March 2009: Sri K.V.Ramanachary, Executive Officer TTDs participated in the TTD Security Guards Training Programme held at SVETA Bhavan, Tirupati on Tuesday morning.
 
Sri PVS Ramakrishna, C.V&S.O TTDs, Sri Bhuman, Director SVETA, Sri Sivakumar Reddy, Addl C.V&S.O, Sri Bhadraiah, DSP, Bomb Disposal Squad and Security Guards took part.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తితిదే భద్రతాసిబ్బందికి మూడురోజుల శిక్షణ

తిరుపతి, మార్చి-24: తితిదేలో పనిచేస్తున్న భద్రతాసిబ్బంది వృత్తి పట్ల నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైన అన్ని రకాల శిక్షణతీసుకోవాల్సిన అవసరం ఉందని తితిదే కార్యనిర్వహణాధికారి డా||కె.వి.రమణాచారి చెప్పారు. మంగళవారం ఉదయం స్థానిక శ్వేతనందు తితిదే భద్రతాసిబ్బందికి మూడురోజుల శిక్షణాకార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇ.ఓ మాట్లాడుతూ తితిదేలో భద్రతాసిబ్బందిని దైవభక్తి,వృత్తిపట్ల నిబద్దత వుండేవారినే ఎంపిక చేసుకోవాలని ఆయన ముఖ్యభద్రతాధికారికి సూచించారు. అంతేకాకుండా శిక్షణతీసుకుంటున్నవారు తమ వృత్తి నిర్వహణలో చురుకుగా ఉంటూ, భక్తులకు సేవలందించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యభద్రతాధికారి శ్రీ పి.వి.యస్‌.రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం 1500 మంది తితిదే సెక్యురిటీ,విజిలెన్స్‌ సిబ్బందికి భద్రతకు సంబంధించి ఆధునిక పద్దతులపై తగిన శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

రాష్ట్రప్రభుత్వ సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి శ్రీ భద్రయ్య భద్రతా సిబ్బందికి పేలుడు పదార్దాలను  ఎలా కనుక్కోవాలి, వాటిని ఎలా నిర్వీర్యం చేయాలి, భద్రతవిషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తితిదే అదనపు ముఖ్యభద్రతాధికారి మేజర్‌ శివకుమార్‌ రెడ్డి, శ్వేతడైరెక్టర్‌ శ్రీభూమన్‌ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.