TS CJ VISITS ANNAPRASADAM AND SEVA SADAN _ అన్నదానం కాంప్లెక్స్, శ్రీవారి సేవ భవనాలను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Tirumala, 11 Mar. 21: The Honourable Chief Justice of Telangana State Justice Hima Kohli visited Annaprasadam Complex and Srivari Seva Sadan building in Tirumala on Thursday.

Additional EO Sri AV Dharma Reddy explained the storage, cooking, serving process by taking the CJ of TS Apex court to the respective halls.

Later the Additional EO took her to Srivari Seva Sadan and shown her the registration, locker and duties allotment process.

The CJ of TS High Court expressed her immense pleasure over the Annaprasadam and Voluntary Seva arrangements by TTD.

Deputy EO Annaprasadam Sri Nagaraja, Deputy EO Reception Sri Lokanatham, AVSO Sri Pavan Kumar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్నదానం కాంప్లెక్స్, శ్రీవారి సేవ భవనాలను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల, 2021 మార్చి 11: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి గురువారం సాయంత్రం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్,
మహిళా శ్రీవారి సేవ భవనాన్ని పరిశీలించారు. టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి వీటి గురించి వివరించారు.

ముందుగా అన్నదానం కాంప్లెక్స్ లో కూరగాయలు నిల్వ ఉంచే కోల్డ్ స్టోరేజ్, వంటశాల‌, భోజనశాలను పరిశీలించారు. ఆ తరువాత మహిళా శ్రీవారి సేవ భవనానికి వెళ్లారు. శ్రీవారి సేవకుల నమోదు విధానం, వసతి, ఇతర సౌకర్యాలు, సేవలందించే విభాగాల గురించి అదనపు ఈఓ వివరించారు.

వీరి వెంట అన్నదానం డిప్యూటీ ఈవో శ్రీ నాగరాజ, రిసెప్షన్ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, ఎవిఎస్వో శ్రీ పవన్ కుమార్ ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.