TS GOVERNOR OFFERS PRAYERS TO HILL LORD_ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ గౌ|| శ్రీమ‌తి త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tirumala, 23 Oct. 19:  His Excellency, the Honourable Governor of Telangana, Smt Tamilisai Soundararajan along with his family members offered prayers in the Hill Shrine of Sri Venkateswara Swamy on Wednesday.

Earlier, on his arrival at the main entrance of the temple-Maha Dwaram, she was welcomed by Addl Executive Officer Sri AV Dharma Reddy, temple priests.

After offering prayers to Dwajasthambham in the temple, the Governor had darshan of Lord Venkateswara.  Later at Ranganayakula Mandapam, the Vedic Pundits offered him Vedasirvachanam. 

The Addl EO presented the first citizen of the State, Thirtha Prasadams and a laminated photo of Lord. 

CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Haridranath, Reception DyEO Sri Balaji, Peishkar Sri lokanadham and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ గౌ|| శ్రీమ‌తి త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

అక్టోబర్ 23, తిరుమల, 2019: తిరుమల శ్రీవారిని బుధ‌వారం తెలంగాణ గవర్నర్‌ గౌ|| శ్రీమ‌తి త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ కుటుంబ స‌మేతంగా దర్శించుకున్నారు.
 
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టిటిడి అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, అర్చక బృందం కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు.  గౌ|| గవర్నర్ ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో  వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, పేష్కార్ శ్రీ లోక‌నాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.