TTD ANNUAL SPORTS FROM FEB 1 TO 17_ ఫిబ్రవరి 1 నుండి టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు

Tirupati, 30 January 2018: The annual sports competition of TTD employees will be conducted on February 1-17 in the parade grounds behind TTD administration buildings.

The contests are separately for men and women, team events of volleyball, caroms, Tug-of-war, football, table tennis, cricket, shuttle and tennis. The schedule of events will be informed soon.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPAT

ఫిబ్రవరి 1 నుండి టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు

తిరుపతి, 2018 జనవరి 30: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు-2018 ప్రారంభోత్సవం ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 9.00 గంటలకు తిరుపతిలోని పరిపాలనా భవనం వైనక వైపు గల పరేడ్‌ మైదానంలో జరుగనుంది. ఈ పోటీలు ఫిబ్రవరి 17వ తేదీ వరకు జరుగనున్నాయి.

ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్‌ తదితర వివరాలు తెలియజేయడం జరుగుతుంది. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్‌ ఆఫ్‌ వార్‌, చెస్‌, వాలీబాల్‌, క్యారమ్స్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్రికెట్‌, షటిల్‌, టెన్నిస్‌ తదితర క్రీడలు ఉన్నాయి. ఉద్యోగులందరూ పాల్గొని ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టిటిడి కోరుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.