TTD ARRANGES FREE BUSES TO TRANSPORT PILGRIMS FROM OCTOPUS CIRCLE TO SILA TORANAM _ ఆక్టోపస్ సర్కిల్ నుండీ శిలాతోరణం వరకు ఉచిత బస్సుల్లో భక్తుల రావణా

PILGRIM RUSH CONTINUES IN TIRUMALA

TIRUMALA, 25 MAY 2024: The summer vacation rush coupled with the week end is continuing in Tirumala on Saturday as serpentine queue lines are spread up to Batagangamma temple.

TTD has made elaborate arrangements in outside queue lines for the benefit of the devotees. From Octopus Circle to Krishna Teja Circle, TTD has set up 27 water distribution points and four Annaprasadam distribution points besides 25 vigilance guards and three sevaks at each point in each shift have been posted to offer services to the multitude of visiting pilgrims.

In the last ten days time, around 2.60lakh pilgrims trekked Alipiri and Srivari Mettu footpaths alone and had darshan of Srivaru. By 5pm statistics on Saturday, 46,486 pilgrims had darshan.

For the benefit of devotees, TTD has operated free buses to transport devotees who are entering the queue lines at Octopus circle to Silatoranam circle much to their comfort and appreciation under the supervision of vigilance authorities.

Supply of Annaprasadam and water at MTVAC, outside queue lines, food courts etc. in Tirumala were the order of the day.

Senior officers supervised the facilities to the devotees round the clock and ensured smooth arrangements.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో కొనసాగుతున్న భ‌క్తుల రద్దీ

•⁠ ⁠శ్రీవారి దర్శనం కోసం 30 గంటలు

•⁠ ⁠టీటీడీ విస్తృత ఏర్పాట్లు

* ఆక్టోపస్ సర్కిల్ నుండీ శిలాతోరణం వరకు ఉచిత బస్సుల్లో భక్తుల రావణా

తిరుమల, 2024 మే 25: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఔటర్ రింగ్ రోడ్డు, శిలా తోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వేస‌వి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది. గ‌త 10 రోజుల్లో శ్రీ‌వారి మెట్టు, అలిపిరి న‌డ‌క మార్గాల్లో దాదాపు 2.60 ల‌క్ష‌ల మంది భ‌క్తులు తిరుమ‌లకు చేరుకొని శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.

శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా శిలాతోర‌ణం, బాట గంగ‌మ్మ గుడి, మార్గ‌ల‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం క్యూలైన్లలో ఉన్న భ‌క్తుల సౌక‌ర్యార్థం 27 ప్రాంతాల్లో తాగునీరు, 4 ప్రాంత‌ల్లో అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్నారు.

భ‌క్తుల‌ సౌక‌ర్యార్థం అక్టోప‌స్ భ‌వ‌నం నుండి శిలాతోర‌ణం వ‌ర‌కు ప్ర‌త్యేకంగా 8 బ‌స్సులు ఏర్పాటు చేసి ప్ర‌తి నిమిషానికి భ‌క్తుల‌ను చేర‌వేసేలా చ‌ర్య‌లు తీసుకున్నారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలోనే మధ్యాహ్నానికి దాదాపు 60 వేల మందికి పైగా అన్న ప్రసాదం అందించగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో 50 వేల మందికి అన్నప్రసాదాలు (ఇందులో ఉప్మా, పొంగల్ ఉన్నాయి) పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్న ప్రసాదాలు అందించారు. అంతే కాకుండా పిల్లలకు పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.

క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.

శనివారం సాయంత్రం 5 గంటల వరకు 46,486 మంది యాత్రికులు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.

భక్తుల అధిక రద్దీ కారణంగా జూన్ 30వ తేదీ వ‌ర‌కు శుక్ర‌, శ‌ని, ఆదివారాల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్ధు చేసింది.

టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు ఇంజినీరింగ్‌, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.